ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Basavaraj Bommai: వారి కుటుంబీకులను పరామర్శిస్తా..

ABN, First Publish Date - 2022-08-02T17:52:57+05:30

దక్షిణకన్నడ జిల్లాలో హత్యకు గురైన ఫాజిల్‌, మసూద్‌ కుటుంబీకులను కూడా పరామర్శిస్తానని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణకన్నడ జిల్లాలో హత్యకు గురైన ఫాజిల్‌, మసూద్‌ కుటుంబీకులను కూడా పరామర్శిస్తానని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ప్రకటించారు. త్వరలోనే దక్షిణకన్నడ జిల్లాకు వెళ్తానని తెలిపారు. కొప్పళలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తుందని, తారతమ్యం ఉండదన్నారు. ప్రవీణ్‌నెట్టారు హత్యకు గురికావడంతో గత వారం బెళ్లారెకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించానన్నారు. ఆ తర్వాత ఫాజిల్‌ హత్య జరిగిందని, అంతకంటే ముందే మసూద్‌ హత్య చోటు చేసుకుందన్నారు. వారం క్రితం హత్యకు గురైన మసూద్‌ కుటుంబాన్ని విస్మరించి కేవలం ప్రవీణ్‌నెట్టారు కుటుంబీకులను మాత్రమే సీఎం పరామర్శించడం విమర్శలకు కారణమైంది. దీంతోపాటు ప్రతిపక్షాల విమర్శలు పెరిగిన మేరకు ముఖ్యమంత్రి(Chief Minister) ఈ నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం దక్షిణకన్నడ(Dakshina Kannada) జిల్లాను సందర్శించే అవకాశం ఉంది. దక్షిణకన్నడ ఎంపీ నళిన్‌కుమార్‌ కటీల్‌ మంగళూరు(Mangalore)లో మాట్లాడుతూ ప్రతీదీ రాజకీయకోణంలో చూడరాదన్నారు. ప్రవీణ్‌ నెట్టారు హత్య రోజున ఉద్రిక్త పరిస్థితులు ఉన్నందున ముఖ్యమంత్రి వారి కుటుంబీకులను పరామర్శించారన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ మాట్లాడుతూ వివాదం చేయడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు. 

Updated Date - 2022-08-02T17:52:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising