ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM statement: ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా అంజనాద్రి అభివృద్ధి

ABN, First Publish Date - 2022-08-02T17:28:29+05:30

హనుమంతుడి జన్మస్థ లమైన అంజనాద్రి కొండ ప్రాంతాలన్ని ప్రపంచ స్థాయిలో గుర్తుంపు పొందేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                        - ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై


బళ్లారి(బెంగళూరు), ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): హనుమంతుడి జన్మస్థ లమైన అంజనాద్రి కొండ ప్రాంతాలన్ని ప్రపంచ స్థాయిలో గుర్తుంపు పొందేలా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. సోమవారం ఆయన అంజనాద్రి కొండతో పాటు శ్రీకృష్ణదేవరాయ కాలం నాటి దుర్గాదేవి ఆలయం(Durga Devi Temple), పంపాసరోవరాన్ని సందర్శించారు. దుర్గామాత ఆలయం వద్ద ఉండే గోశాలలో ప్రత్యేక పూజల చేశారు. అక్కడ గోమాతకు పూజచేసి ముద్దాడారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ అంజనాద్రిలోనే హనుమంతుడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయని వివరించారు. హనుమంతుడి తల్లి అంజనీదేవి ఇక్కడ ఉన్నట్లు పురాణాల ద్వారా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అంజనాద్రి కొండతో పాటు దుర్గామాత(Mother Durga) ఆలయం, గోశాలను ప్రపంచ స్థాయిలో గుర్తుంపు తెచ్చేలా అభివృద్ధి పనులు చేస్తామన్నారు. పర్యాటక శాఖతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ ప్రాంత అభివృద్ధికి ఇప్పటికే నిధులు విడుదల చేశామన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌, మంత్రి శశికళ, ఎంపీ కర్డి సంగన్న, ఎమ్మెల్యేలు పారణ మునవల్లి, బసవరాజ దడేసుగూరు, సోమశేఖర్‌రెడ్డి, అమర్‌గౌడ, మహేష్‌, తదితరులు, పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-02T17:28:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising