ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నైతిక బాధ్యతతోనే మంత్రి రాజీనామా

ABN, First Publish Date - 2022-04-15T16:47:05+05:30

కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప స్వచ్ఛందంగా రాజీనామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                       - ఎలాంటి విచారణకైనా సిద్ధం: సీఎం బొమ్మై


బెంగళూరు: కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌ ఆత్మహత్య నేపథ్యంలో నైతిక బాధ్యత వహిస్తూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప స్వచ్ఛందంగా రాజీనామా చేయనున్నారని సీఎం బొమ్మై నగరంలో గురువారం రాత్రి ప్రకటించారు. సంతోష్‌ ఆత్మహత్య ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని మంత్రి ఈశ్వరప్ప తనకు వివరించారన్నారు. ఈ వ్యవహారంలో నిర్దోషిగా తేలేంతవరకు మంత్రి బాధ్యతలకు దూరంగా ఉంటానని ఆయన తెలిపారని, ఇందుకు తాను కూడా అంగీకరించానని అన్నారు. శుక్రవారం ఈశ్వరప్ప తనను కలిసి మంత్రి పదవికి రాజీనామా చేస్తారని, తక్షణం దీనిని ఆమోదం నిమిత్తం గవర్నర్‌కు పంపుతానని అన్నారు. కాంట్రాక్టర్‌ సంతోష్ పాటిల్‌  ఆత్మహత్య వెనుక కుట్రకోణం ఉందని, విచారణ పరిధిలో దీనిని కూడా చేరుస్తామని సీఎం వెల్లడించారు. ఈశ్వరప్ప రాజీనామా వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికర పరిణామం కాదని మీడియా ప్రతినిధుల ప్రశ్నకు బదులిచ్చారు. బొమ్మై కేబినెట్‌లో ఇప్పటికే బెళగావి జిల్లాకు చెందిన ప్రముఖ నేత రమేష్‌ జార్కిహొళి సెక్స్‌ కుంభకోణంలో చిక్కుకుని రాజీనామా చేశారు. తాజాగా శివమొగ్గకు చెందిన కేఎస్‌ ఈశ్వరప్ప 40 శాతం కమీషన్‌ ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేయనుండటం గమనార్హం.

Updated Date - 2022-04-15T16:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising