ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌ నుంచి 263 మంది విద్యార్థులు సురక్షితంగా రాక

ABN, First Publish Date - 2022-03-05T17:47:57+05:30

యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ నుంచి ఇంత వరకు 263 మంది విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగొచ్చారని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం ఆయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                   - ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు: యుద్ధంతో అట్టుడికిపోతున్న ఉక్రెయిన్‌ నుంచి ఇంత వరకు 263 మంది విద్యార్థులు సురక్షితంగా రాష్ట్రానికి తిరిగొచ్చారని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై ప్రకటించారు. బెంగళూరులో శుక్రవారం ఆయన బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ముందు బాలబ్రూయి గెస్ట్‌హౌస్‌ సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి అర్చనలో పాల్గొన్నారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 27 నుంచి గురువారం అర్ధరాత్రి వరకు 190 మంది విద్యార్థులు ఉక్రెయిన్‌ నుంచి ప్రత్యేక విమానాల్లో రాగా, శుక్రవారం మరో 73మంది వచ్చారన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణా ప్రాధికార కమిషనర్‌, ఉక్రెయిన్‌లో కన్నడ విద్యార్థుల సంరక్షణ నోడల్‌ అధికారిగా ఉన్న డాక్టర్‌ మనోజ్‌ రాజన్‌ బాగా పనిచేస్తున్నారని సీఎం కొనియాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న చిట్టచివరి కన్నడిగుడిని కూడా సురక్షితంగా తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు. 


Updated Date - 2022-03-05T17:47:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising