ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Covid నియమాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

ABN, First Publish Date - 2022-01-11T17:07:35+05:30

కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించే వారెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ విషయంలో ఎలాంటి తారతమ్యాలకు తావులేకుండా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హెచ్చరించారు. నగరంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముఖ్యమంత్రి హెచ్చరిక

- కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సహకరించాలని వినతి


బెంగళూరు: కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించే వారెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని ఈ విషయంలో ఎలాంటి తారతమ్యాలకు తావులేకుండా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై హెచ్చరించారు. నగరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ చేపట్టిన మేకెదాటు యాత్రలో నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలోనే 31 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని పేర్కొన్నారు. యాత్ర నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ యాత్రలో పాల్గొంటున్న వారి ఆరోగ్య సంరక్షణపై ప్ర భుత్వం ఆందోళన చెందుతోందని, వీరికి కరోనా పరీక్షలు జరుపుతున్నామని సీఎం వెల్లడించారు. ప్రజలందరి ఆరోగ్య సంరక్షణ ప్రభుత్వ కర్తవ్యమని, ఇందుకు సహకరించాలని సీఎం విజ్ఞప్తిచేశారు. ఇది పంతాలు పట్టింపులకు పోయే సమయం కాదన్నారు. కొవిడ్‌ నియమాలను ఉల్లంఘించే వారు ఎంతటి ప్రముఖులైనా సరే వదిలిపెట్టే ప్రశ్నేలేదని, ఈ విషయంలో పోలీసు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఆదివారం ఒక్కరోజే 12వేల కేసులు వెలుగు చూశాయని, పా జిటివిటీ రేటు 6.8గా ఉంటే బెంగళూరు నగరంలో ఇది 10 శాతం దాటేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. వారాంతపు కర్ఫ్యూను మరింత పక్కాగా అమలు చేయాలని అధికారులకు సూచన చేశామన్నారు.

Updated Date - 2022-01-11T17:07:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising