ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రివర్గ విస్తరణ ఉంది.. కానీ..!

ABN, First Publish Date - 2022-01-23T16:22:47+05:30

రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం దాదాపు తెరపైకి వచ్చి ఒక్కసారిగా చల్లబడింది. ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల వారం రోజులుగా సాగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎప్పుడు, ఎంత మందో చెప్పలేం

- సమాధానం దాటవేసిన CM


బెంగళూరు: రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ అంశం దాదాపు తెరపైకి వచ్చి ఒక్కసారిగా చల్లబడింది. ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల వారం రోజులుగా సాగుతున్న పరిణామాలపై ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో విస్తరణ అంశం ప్రస్తావనలో ఉందన్నారు. ప్రస్తుతానికి నాలుగు స్థానాలకు ఖాళీగా ఉన్నాయని, వాటిని మాత్రమే భర్తీ చేయాలా..? లేక మరిన్ని మార్పులు చేయాలా..? అనే అంశం ఇప్పుడు చెప్పలేనని దాటవేశారు. సీఎం రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్యే రేణుకాచార్య, సీనియర్‌ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ రహస్యంగా భేటీ కావడం చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది గడువుంది. ఈలోగానే పాలన వేగవంతం చేసుకునేందుకు ముఖ్యమంత్రి సిద్ధమయ్యారు. ప్రస్తుతం కేబినెట్‌లోని సీనియర్లను తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వడం ద్వారా మరిన్ని జిల్లాల్లో ప్రాబల్యం పెంచుకునే ఆలోచనలో ఉన్నారు. ఇదే అభిప్రాయంలో అధిష్ఠానం కూడా ఉంది. జిల్లాలవారీగానే కాకుండా సామాజిక వర్గాల కూర్పులోనూ ప్రాధాన్యత ఇవ్వదలిచినట్టు తెలుస్తోంది. విస్తరణ జరిగితే కొత్తగా కేబినెట్‌లోకి చేరదలచుకున్నవారిలో రేణుకాచార్య, బసనగౌడపాటిల్‌ యత్నాళ్‌, రాజుగౌడ, పూర్ణిమా శ్రీనివాస్‌, ఎంపీ కుమారస్వామి, ఎన్‌ మహేశ్‌, పీ రాజీవ్‌, సోమశేఖర్‌రెడ్డి వంటివారు ఉన్నారు. ఇప్పటికే ప్రక్రియ కొలిక్కి వచ్చేది. అయితే ఐదు రాష్ట్రాల ఎన్నికలు రావడంతో జాప్యమైంది. 

Updated Date - 2022-01-23T16:22:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising