ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

777 Charlie సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకున్న CM

ABN, First Publish Date - 2022-06-14T18:44:26+05:30

సినిమా చూసిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ ‘‘కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. కుక్క తన కళ్లతో ఎమోషన్స్‌ని బాగా పలికించింది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. షరతులు లేని ప్రేమ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: 777 చార్లీ (777 Charlie) అనే సినిమా చూసి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై(Karnataka Chief Minister Basavaraj Bommai) చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. పెంపుడు కుక్క(pet dog)తో ఒక వ్యక్తికి ఉన్న అనుబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. అయితే బొమ్మైకి చనిపోయిన తన పెంపుడు కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారట. సినిమా చూస్తూ చాలా భావోద్వేగానికి గురయ్యారట. సినిమా హాలులోనే కన్నీళ్లు పెట్టుకున్నారట. బొమ్మై కన్నీళ్లు పెట్టుకున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


సినిమా చూసిన అనంతరం బొమ్మై మాట్లాడుతూ ‘‘కుక్కల గురించి అనేక సినిమాలు వచ్చాయి. అయితే జంతువులతో ఉండే అనుబంధం, భావోద్వేగాన్ని ఈ సినిమాలో చాలా గొప్పగా చూపించారు. కుక్క తన కళ్లతో ఎమోషన్స్‌ని బాగా పలికించింది. సినిమా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. షరతులు లేని ప్రేమ గురించి నేను మాట్లాడుతూనే ఉంటాను. కుక్కలది షరతులు లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ’’ అని అన్నారు. బొమ్మై వ్యక్తిగతంగా జంతు ప్రేమికులు. కుక్కలంటే ఆయనకు మహా ప్రేమ. గతేడాది ఆయన పెంపుడు కుక్క చనిపోయినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాజా సినిమా చూసినప్పుడు మళ్లీ తన కుక్క గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Updated Date - 2022-06-14T18:44:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising