ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేజే నగర్ మర్డర్ కేసు.. సీఐడీకి అప్పగింత

ABN, First Publish Date - 2022-04-11T23:26:23+05:30

ఇటీవల జరిగిన జేజే నగర్ మర్డర్ కేసుతోపాటు, ఎస్ఐ జాబ్ స్కాం కేసును కూడా సీఐడీకి అప్పగించాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి అప్పగించే విషయంపై డీజీపీతోపాటు, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్లు బొమ్మై చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవల జరిగిన జేజే నగర్ మర్డర్ కేసుతోపాటు, ఎస్ఐ జాబ్ స్కాం కేసును కూడా సీఐడీకి అప్పగించాలని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసును సీఐడీకి అప్పగించే విషయంపై డీజీపీతోపాటు, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌తో మాట్లాడినట్లు బొమ్మై చెప్పారు. జేజే నగర్ మర్డర్ కేసు ఇటీవల సంచలనం సృష్టించింది. బెంగళూరులోని జేజే నగర్‌లో గత మంగళవారం చంద్రు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రు, అతడి స్నేహితుడు సైమన్ రాజ్ గత మంగళవారం రాత్రి రెండున్నర గంటల తర్వాత బైక్‌పై వెళ్తుండగా, పాషా అనే వ్యక్తి బైక్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో పాషాకు, చంద్రుకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో పాషా తన స్నేహితులను పిలవడంతో గొడవ మరింత పెద్దదైంది. గొడవలో పాషా, చంద్రుపై కత్తితో దాడి చేసి, స్నేహితులతో కలిసి పారిపోయాడు. వెంటనే సైమన్, చంద్రును స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, చంద్రు మరణించాడు. అయితే, పోలీసులు చెప్పిన వివరాలు తప్పని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. 


మరోవైపు ఇది అనుకోకుండా జరిగిన ఘటన కాదని, ప్లాన్ ప్రకారమే చంద్రు హత్య జరిగిందని అతడి స్నేహితుడు సైమన్ రాజ్ చెప్పాడు. చంద్రు హత్య విషయంలో పోలీసులు అబద్దాలు చెబుతున్నారని అధికార బీజేపీ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఈ కేసుకు ప్రాధాన్యం ఏర్పడింది. మరోవైపు కర్ణాటకలో జరిగిన ఎస్ఐ జాబ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో భారీ స్కామ్ జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 21 మార్కులకే సమాధానాలు రాసిన ఒక అభ్యర్థికి వంద మార్కులు వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును కూడా సీఐడీకి అప్పగించాలని సీఎం నిర్ణయించారు.

Updated Date - 2022-04-11T23:26:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising