ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తీర్పుల జాప్యంతో అందరికీ నష్టమే

ABN, First Publish Date - 2022-06-03T14:04:44+05:30

ఆలస్యంగా వెలువడే తీర్పుల వల్ల ప్రతి ఒక్కరికీ నష్టమేనని మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారి అభిప్రాయపడ్డారు. నీలగిరి జిల్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - సీజే మునీశ్వర్‌నాధ్‌ భండారి 


ప్యారీస్‌(చెన్నై), జూన్‌ 2: ఆలస్యంగా వెలువడే తీర్పుల వల్ల ప్రతి ఒక్కరికీ నష్టమేనని మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మునీశ్వర్‌నాధ్‌ భండారి అభిప్రాయపడ్డారు. నీలగిరి జిల్లా ఊటీలో రూ.38 కోట్లతో కొత్తగా నిర్మించిన ఉమ్మడి కోర్టు ప్రాంగణాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని నగరం చెన్నైలో ఉమ్మడి కోర్టులను ఏర్పాటు చేసేందుకు నగరంలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ న్యాయశాఖకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నారని తెలిపారు. నీలగిరి జిల్లాలో అందుబాటులో ఉన్న అటవీ వనరులను ఆ శాఖ బాధ్యతగా సంరక్షిస్తుందని, అటవీ సంపద అక్రమదారులవశం కాకుండా నిబంధనలను కఠినతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు ఎన్‌. సతీష్ కుమార్‌, ఎన్‌.శేషసాయి, భవానీ సుబ్బరాయన్‌, ఆనంది సహా రాష్ట్ర న్యాయశాఖామంత్రి రఘుపతి, అటవీశాఖామంత్రి రామచంద్రన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T14:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising