ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సివిల్స్-2021 ఫలితాలు విడుదల.. శ్రుతి శర్మకు ఫస్ట్ ర్యాంక్

ABN, First Publish Date - 2022-05-30T19:09:46+05:30

న్యూఢిల్లీ: సివిల్స్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సివిల్స్-2021 ఫలితాలు విడుదలయ్యాయి. సివిల్ సర్వీసెస్‌కు మొత్తం 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేసింది. సివిల్స్‌లో శ్రుతి శర్మకు ఆలిండియా నెంబర్-1 ర్యాంక్,అంకిత అగర్వాల్‌ సెకండ్ ర్యాంక్, గామిని సింగ్లా మూడో ర్యాంకు సాధించారు. జనరల్‌ కోటాలో 244, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఎంపికయ్యారు. ఐఏఎస్‌కు 180 మంది, ఐపీఎస్‌కు 200 మంది, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది, 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికయ్యారు.  


తెలుగువారైన యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయికి 56వ ర్యాంక్, సుధీర్‌కుమార్‌రెడ్డికి 69వ ర్యాంక్ వచ్చింది. ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంక్, బి.చైతన్యరెడ్డికి 161వ ర్యాంక్, కమలేశ్వర్‌రావు 297వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ 420వ ర్యాంక్ వచ్చింది. ఉప్పులూరి చైతన్యకు 470, మన్యాల అనిరుధ్‌కు 564, బిడ్డి అఖిల్‌కు 566, రంజిత్‌కుమార్‌కు 574, పాండు విల్సన్‌‌కు 602, బాణావత్‌ అరవింద్‌‌కు 623, బచ్చు స్మరణ్‌రాజ్‌‌కు 676వ ర్యాంక్ దక్కింది. 































Updated Date - 2022-05-30T19:09:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising