ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా హక్కులను దెబ్బతీయొద్దు : అమెరికాకు చైనా హెచ్చరిక

ABN, First Publish Date - 2022-03-15T22:04:09+05:30

ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో వ్యవహరించేటపుడు తమ చట్టబద్ధ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాతో వ్యవహరించేటపుడు తమ చట్టబద్ధ హక్కులు ప్రభావితం కాకుండా జాగ్రత్తవహించాలని అమెరికాను చైనా కోరింది. అమెరికా విధిస్తున్న ఆంక్షల వల్ల అందరికీ నష్టం జరుగుతుందని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని గుర్తు చేసింది. 


చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సోమవారం స్పానిష్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయేల్ అల్బేర్స్‌తో టెలిఫోన్ ద్వారా ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో చైనాకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ సంక్షోభంలో చైనా పాత్ర లేదన్నారు. పాశ్చాత్య దేశాలు విధిస్తున్న ఆంక్షల ప్రభావం చైనాపై పడాలని తాము కోరుకోవడం లేదన్నారు. చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకునే హక్కు చైనాకు ఉందని చెప్పారు. 


రష్యా కార్పొరేట్ రంగంపైనా, ఆర్థిక వ్యవస్థపైనా అంతర్జాతీయ ఆంక్షలు మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఆర్థికంగా జీవం పోయవద్దని చైనాను అమెరికా హెచ్చరించింది. యుద్ధం కొనసాగితే రష్యా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమయ్యేందుకు అమలు చేస్తున్న చర్యల ప్రభావాన్ని తగ్గించేందుకు చైనా ప్రయత్నించే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతివ్వాలని చైనాను రష్యా కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే చైనా కంపెనీలపై ఆర్థిక ఆంక్షలు విధిస్తారనే ప్రచారం జరుగుతోంది. 


ఇదిలావుండగా, యుద్ధానికి మద్దతివ్వాలని తమను రష్యా కోరినట్లు వచ్చిన వార్తలను చైనా తోసిపుచ్చింది. అదే విధంగా రష్యా కూడా ఈ వార్తలను ఖండించింది. సైనిక సాయం చేయాలని తాను చైనాను కోరలేదని రష్యా తెలిపింది. 


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని దండయాత్రగా గుర్తించేందుకు చైనా తిరస్కరించింది. ఇరు దేశాలతోనూ మామూలుగానే వ్యాపార సంబంధాలను కొనసాగిస్తామని తెలిపింది. రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ చైనా ఆ దేశాల జాబితాలో చేరలేదు. 


ఇదిలావుండగా, అమెరికా, చైనా అధికారులు సోమవారం ఇటలీలోని రోమ్ నగరంలో సమావేశమయ్యారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతోపాటు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. 


Updated Date - 2022-03-15T22:04:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising