ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌పై రష్యా చర్య యుద్ధమే: చైనా

ABN, First Publish Date - 2022-03-03T00:30:30+05:30

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ఎట్టకేలకు యుద్ధంగా అంగీకరించింది చైనా. ఉక్రెయిన్‌లోని పౌరులపై జరుగుతున్న దాడుల విషయంలో తమ దేశం తీవ్ర ఆందోళనతో ఉందని చైనా ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన సైనిక చర్యను ఎట్టకేలకు యుద్ధంగా అంగీకరించింది చైనా. ఉక్రెయిన్‌లోని పౌరులపై జరుగుతున్న దాడుల విషయంలో తమ దేశం తీవ్ర ఆందోళనతో ఉందని చైనా ప్రకటించింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ బుధవారం ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబాతో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం విషయంలో ఆందోళన చెందుతున్నామని, యుద్ధాన్ని నివారించడంలో సహకారం అందించేందుకు చైనా సిద్ధంగా ఉందని వాంగ్ యూ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై చేస్తున్న దాడులను రష్యా సైనిక చర్యగా చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో రష్యా చర్యను చైనా ఇప్పటివరకు ఖండించలేదు. తాజాగా ఉక్రెయిన్ మంత్రితో మాట్లాడటం ద్వారా, రష్యా విషయంలో తమ వైఖరి కొంత మారినట్లుందని చైనా పరోక్షంగా సూచించినట్లైంది. మరోవైపు ఉక్రెయిన్ మంత్రి మాట్లాడుతూ చైనాతో సంబంధాలు బలపర్చుకోవాలి అనుకుంటున్నామని, కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో అవసరమైతే చైనా సాయం తీసుకునేందుకు సిద్ధమని ప్రకటించారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు కూడా సిద్ధమని చైనా ప్రకటించింది. అమెరికా వైఖరే ఈ సంక్షోభానికి కారణమని చైనా ఇప్పటివరకు విమర్శిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

Updated Date - 2022-03-03T00:30:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising