ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌కు చైనా సాయం

ABN, First Publish Date - 2022-03-21T22:24:17+05:30

రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. చైనీస్ రెడ్‌క్రాస్ తరఫున 10 మిలియన్ల యువాన్లు (దాదాపు రూ.12 కోట్లు) మానవతా సాయంగా అందిస్తామని చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్ వెన్‌బిన్ సోమవారం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా దాడితో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు చైనా ముందుకొచ్చింది. చైనీస్ రెడ్‌క్రాస్ తరఫున 10 మిలియన్ల యువాన్లు (దాదాపు రూ.12 కోట్లు) మానవతా సాయంగా అందిస్తామని చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్ వెన్‌బిన్ సోమవారం ప్రకటించారు. అయితే ఇప్పటికే ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని చైనా ప్రకటించింది. 5 మిలియన్ల యువాన్లు (దాదాపు రూ.6 కోట్లు) ఉక్రెయిన్‌కు అందిస్తామని ఈ నెల మొదటి వారంలో ప్రకటించింది. తాజాగా ప్రకటించిన సాయం దీనికి అదనం. అనేక దేశాలు ఉక్రెయిన్‌కు ఆర్థిక సాయం అందిస్తున్నాయి. భారత్ ఇప్పటికే మందులు, దుప్పట్లు, ఆహారం వంటివి ఉక్రెయిన్‌కు పంపింది. అమెరికా, యూరప్ కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి. ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్‌ భారీగా నష్టపోయింది.

Updated Date - 2022-03-21T22:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising