ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సోవియెట్ రష్యా మాదిరిగానే చైనా కుప్పకూలవచ్చు’

ABN, First Publish Date - 2022-01-23T23:21:10+05:30

పరిపూర్ణ జాతీయ భద్రతా విధానాలను గుడ్డిగా అనుసరించడంతోపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : పరిపూర్ణ జాతీయ భద్రతా విధానాలను గుడ్డిగా అనుసరించడంతోపాటు మితిమీరిన రక్షణ రంగ వ్యయం వల్ల సోవియెట్ రష్యా మాదిరిగానే చైనా కూడా కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని చైనా అత్యున్నత స్థాయి విదేశాంగ విధానం సలహాదారు జియా కింగువో హెచ్చరించారు. సైనిక విస్తరణ వల్ల దీర్ఘకాలిక భద్రతకు కలిగే ప్రమాదాన్ని వివరించారు. 


చైనాలో అత్యున్నత స్థాయి రాజకీయ సలహా వ్యవస్థ అయిన చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) సభ్యుడు జియా కింగువో రాసిన వ్యాసాన్ని ఓ హాంగ్ కాంగ్‌  పత్రిక ఆదివారం ప్రచురించింది.  చైనా కమ్యూనిస్టు పార్టీ నేతలను ఈ వ్యాసంలో జియా హెచ్చరించారు. జాతీయ భద్రతపైనే పరిపూర్ణ దృష్టి పెట్టే విధానం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందన్నారు. ఈ విధానాన్ని గుడ్డిగా అనుసరించడం వల్ల యూనియన్ ఆఫ్ సోవియెట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్ (యూఎస్ఎస్ఆర్) కుప్పకూలినట్లుగానే చైనా కూడా కుప్పకూలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. భద్రతను విశృంఖలంగా అనుసరించడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయని, ప్రయోజనాలు విపరీతంగా తగ్గిపోతాయని అన్నారు. భద్రతకుగల తులనాత్మక స్వభావాన్ని పట్టించుకోకపోవడం, ఈ విధానాన్ని గుడ్డిగా అనుసరించడం వల్ల దేశ  భద్రత స్థాయి తగ్గుతుందని చెప్పారు. దీనివల్ల భరింపశక్యం కాని ఖర్చులు అవుతాయని, పరిపూర్ణ భద్రతను సాధించడం సాధ్యం కాదని తెలిపారు. 


రక్షణ రంగంలో అతిగా ఖర్చు చేయడంపై దృష్టి పెట్టడం వల్ల ఆయుధాల పోటీ మొదలవుతుందని, ఈ పోటీలో పాల్గొనే అన్ని దేశాలు తక్కువ భద్రతగలవిగా మారిపోతాయని తెలిపారు. ఈ సందర్భంగా యూఎస్ఎస్ఆర్ పరిస్థితిని గుర్తు చేశారు. యూఎస్ఎస్ఆర్ అనేక దశాబ్దాలపాటు దీర్ఘకాలిక భద్రతను పట్టించుకోలేదని, ప్రజల జీవితాలు మెరుగుపడలేదని, ఫలితంగా రాజకీయ మద్దతును కోల్పోవడంతో 1991లో ముక్కలైందని తెలిపారు. 


ఇటువంటి చర్యలు (రక్షణ రంగంపై అతిగా ఖర్చు చేయడం) స్వల్పకాలిక  ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక ప్రయోజనాలను బలి చేస్తాయన్నారు. యూఎస్ఎస్ఆర్ వేగంగా కుప్పకూలడానికి ఇదే కారణమని తెలిపారు. 


చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ అధికారం చేపట్టినప్పటి నుంచి అంతర్గత, బాహ్య భద్రత చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత ముఖ్యమైనదిగా మారింది. గత ఏడాది చైనా మిలిటరీ బడ్జెట్ 200 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. వచ్చే మార్చిలో ప్రతిపాదించే బడ్జెట్‌లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 


Updated Date - 2022-01-23T23:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising