ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శాటిలైట్లను కూల్చే లేజర్ వెపన్లు తయారు చేస్తున్న చైనా

ABN, First Publish Date - 2022-03-19T20:45:24+05:30

శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లు తయారు చేస్తోంది చైనా. ‘రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ (ఆర్‌కేఏ)’ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాటిలైట్లను ధ్వంసం చేసే అధునాతన లేజర్ వెపన్లు తయారు చేస్తోంది చైనా. ‘రిలేటివిస్టిక్ క్లిస్ట్రాన్ యాంప్లిఫైర్ (ఆర్‌కేఏ)’ పేరుతో ఒక మైక్రోవేవ్ యంత్రాన్ని చైనా తయారు చేస్తోంది. ఈ డివైజ్ 5 మెగావాట్ల సామర్ధ్యంం కలిగిన ఒక వేవ్‌ను సృష్టిస్తుంది. దీన్ని మిలిటరీ, సివిల్ అవసరాల కోసం వాడుకోవచ్చు. అయితే, ఇది నేరుగా భూమి పైనుంచి ఆకాశంలోని టార్గెట్ చేధించలేదు. కానీ, శాటిలైట్లపై మాత్రం ప్రభావం చూపించగలదు. వాటిని ధ్వంసం చేయడం లేదా పనికిరాకుండా చేస్తుంది. శాటిలైట్లపై ప్రభావం చూపి, శత్రువులకు చెందిన సెన్సిటివ్ ఎలక్ట్రానిక్స్‌ను ధ్వంసం చేస్తుంది. 


ఇలాంటి ఆయుధాలను డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటారు. అంటే ఇవి కైనెటికట్ ఎనర్జీకన్నా, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎనర్జీపైనే ఎక్కువగా ఆధారపడి, శత్రువుల పరికరాలపై దాడి చేస్తాయి. అయితే, ఆర్‌కేఏ వెపన్స్ తయారుచేస్తుందనే వార్తలను చైనా ఖండించింది. ప్రస్తుత పరిస్థితుల్లో స్పేస్.. అనేక ప్రయోగాలకు వేదికగా మారుతోంది. ఇటీవల చైనా అణ్వస్త్రాల్ని మోసుకెళ్లగలిగే హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికల్ రూపొందించిందనే వార్తలు వెలువడ్డాయి. ఈ వార్త ప్రపంచానికి సవాలుగా మారింది. దీనిపై అప్పట్లో అమెరికా స్పందించింది. చైనా మిస్సైల్స్‌ను ఎదుర్కోవాలంటే స్పేస్ బేస్డ్ సెన్సర్స్ రూపొందించాల్సిన అవసరం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

Updated Date - 2022-03-19T20:45:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising