ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Noval Virus: చైనాలో మరో కొత్త రకం వైరస్.. వెలుగులోకి 35 కేసులు

ABN, First Publish Date - 2022-08-10T02:29:38+05:30

చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ (Corona Virus) ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తైపే: చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ (Corona Virus) ప్రపంచాన్ని ఎంతగా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది దాని బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి భయం ఇంకా పూర్తిగా సమసిపోలేదు. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇంకా అది ఉనికిలోనే ఉంది. కొత్తకొత్త వేరియంట్లుగా వచ్చి జనాన్ని పీడిస్తూనే ఉంది. కరోనా నుంచి ఈ ప్రపంచం పూర్తిగా కోలుకోకముందే అదే చైనా నుంచి మరో భయంకరమైన వార్త ఒకటి వచ్చింది. 


తాజాగా ఆ దేశంలో నోవల్ లంగ్యా హెనిపా వైరస్ (LayV)ని గుర్తించారు. 35 మంది ఇప్పటికే దాని బారినపడినట్టు తైవాన్‌కు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) తెలిపింది. ఈ వైరస్‌ను, దాని వ్యాప్తిని గుర్తించేందుకు న్యూక్లిక్ యాసిడ్ పద్ధతిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వైరస్‌ విషయంలో చైనాను నిశితంగా గమనిస్తున్నట్టు తైవాన్ పేర్కొంది. 


షాంగ్‌డాంగ్, హెనాన్ ప్రావిన్సులలో ఈ ఇన్ఫెక్షన్లు వెలుగు చూశాయి. ఈ వైరస్‌పై నిఘా పెంచేందుకు, జినోమ్ సీక్వెన్సింగ్‌ కోసం దేశీయంగా ప్రయోగశాలల ఏర్పాటు చేసేందుకు ఒక ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్ సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ చువాంగ్ జెన్-హ్సియాంగ్ తెలిపారు. ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది సోకితే మూత్రపిండ, కాలేయ సమస్యలు వచ్చే అవకాశం ఉందని ‘తైపే టైమ్స్’ పేర్కొంది. కాగా, ఈ వైరస్ కారణంగా ఇప్పటి వరకు మరణాలు నమోదు కాలేదని తెలిపింది. అయితే, దీనిని మరింత పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని వివరించింది. 

Updated Date - 2022-08-10T02:29:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising