ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐరాసలో India, America లకు China చైనా షాక్... ఉగ్రవాది మక్కీని..

ABN, First Publish Date - 2022-06-17T18:17:00+05:30

పాకిస్తాన్‌ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ(Abdul Rehman Makki )ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలనే భారత్(India), అమెరికా(America)

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్ : పాకిస్తాన్‌ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ(Abdul Rehman Makki )lని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించాలనే భారత్(India), అమెరికా(America)ల ఉమ్మడి ప్రయత్నాలను చైనా(China) నిలువరించింది. ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్‌లోని ‘ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ’ ముందుంచిన ఉమ్మడి ప్రతిపాదనను చివరి నిమిషంలో చైనా నిలుపుదల చేసింది. దీంతో భారత్, అమెరికాలకు భంగపాటు తప్పలేదు. కాగా చైనా మరోసారి తన పాక్ అనుకూల వైఖరిని ప్రదర్శించింది. 26/11 దాడుల సూత్రధారి, లష్కరే తోయిబా( Lashkar-e-Taiba) చీఫ్ హఫీజ్ సయ్యద్‌(Hafiz Saeed)కు అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీ బావమరిది. అమెరికా ఇప్పటికే అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. అంతర్జాతీయ ఉగ్రవాది(స్పెషల్లీ డెసిగ్నేటెడ్ గ్లోబల్ టెర్రిరిస్ట్)గా పేర్కొంటూ నవంబర్ 2019లో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజరీ ప్రకటన చేసింది. దీంతో అమెరికాను కలుపుకుని మక్కీపై ఆంక్షలు విధించాలనే భారత్ మరో ప్రయత్నం చైనా కారణంగా నిలిచిపోయింది. ఐక్యరాజ్య సమితి(UNO) భద్రతా మండలి ‘1267 ఐఎస్ఐఎస్, అల్ ఖైదా ఆంక్షల కమిటీ’ కింద అబ్దుల్ రెహ్మాన్‌ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ప్రకటింపజేసేందుకు భారత్, అమెరికాలు ఉమ్మడిగా ప్రయత్నించాయి.


ఇదివరకు కూడా పలువురు పాకిస్తానీ ఉగ్రవాదులపై చర్యల విషయంలో భారత్ ఇతర దేశాలతో కలిసి చేసిన ఉమ్మడి ప్రయత్నాలను చైనా నిలువరించింది. అయినప్పటికీ లష్కరే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటింపజేయించడంలో భారత్ 2019లో చక్కటి దౌత్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్దకాల పోరాటం తర్వాత ఈ ఉపశమనం లభించింది.

Updated Date - 2022-06-17T18:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising