ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్నారులకు వ్యాక్సిన్‌లో వెనుకంజ

ABN, First Publish Date - 2022-03-20T17:05:24+05:30

కొవిడ్‌ వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ఇస్తున్న వ్యాక్సిన్‌ దే శంలోనే కర్ణాటక ప్రగతిపరంగా సాగినా 12-14 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో నత్తనడకన సాగుతోంది. పిల్లలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                         - మూడు రోజులుగా నత్తనడకన సాగుతున్న వైనం


బెంగళూరు: కొవిడ్‌ వైరస్‌ నుంచి రక్షణ పొందేందుకు ఇస్తున్న వ్యాక్సిన్‌ దేశంలోనే కర్ణాటక ప్రగతిపరంగా సాగినా 12-14 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో నత్తనడకన సాగుతోంది. పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 12-14 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్‌ ప్రక్రియను ప్రారంభించారు. రాష్ట్రంలో 20.25 లక్షల మంది దాకా అర్హులైన పిల్లలు ఉండగా మూడు రోజులపాటు సా గిన కార్యక్రమంలో 68,321 మంది మాత్రమే వ్యాక్సిన్‌ పొందారు. 2020 మార్చిలో కొవిడ్‌ వైరస్‌ దేశమంతటా ప్రబలింది. పది నెలల తర్వాత వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. తొలుత ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత 45 ఏళ్లు పైబడినవారికి, 18 ఏళ్లు పైబడినవారికి అందుబాటులోకి వచ్చింది. తదుపరి 15-18 ఏళ్లవారికి అవకాశం కల్పించారు. తాజాగా ఈనెల 16 నుంచి 12-14 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌లు వేయగా తల్లిదండ్రులు ఉత్సాహం చూపకపోవడంతో అనుకున్న లక్ష్యాలను సాధించలేకపోతున్నారు. బాగల్కోటెలో 66,812 మందికి వ్యాక్సిన్‌లు వేయాల్సి ఉండగా మూడు రోజులలో కేవలం 58మందికి మాత్రమే సాధ్యమైంది. బెళగావిలో 61,258మందికిగాను 39మంది, ధార్వాడలో 60వేలమందికిగాను 20 మంది, శివమొగ్గలో 53వేల మందికిగాను 40 మంది మాత్రమే టీకాలు వేసుకున్నారు. బెంగళూరు నగరంలో 38,186కు గాను 586 మంది, కొడగులో 16,282 మందికిగాను 723 మంది, కొప్పళలో 53,352 మందికిగాను 419 మంది, రాయచూరులో 74,458 మందికిగాను 483 మంది, యాదగిరిలో 52,186 మందికిగాను 172 మంది టీకాలు వేయించుకున్నారు. చిత్రదుర్గలో 53,342 మందికిగాను 11,708 మంది రికార్డుస్థాయిలో వ్యాక్సిన్‌లు వేసుకున్నారు. 

Updated Date - 2022-03-20T17:05:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising