ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: రాష్ట్రంలో మరో కర్మాగారం

ABN, First Publish Date - 2022-10-01T14:26:05+05:30

చెంగల్పట్టు జిల్లా మహేంద్రా సిటీలో రూ.1100 కోట్లతో తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రూ.1100 కోట్లతో స్మార్ట్‌ఫోన్ల ఫ్యాక్టరీ

- ప్రారంభించిన సీఎం స్టాలిన్‌


చెన్నై, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): చెంగల్పట్టు జిల్లా మహేంద్రా సిటీలో రూ.1100 కోట్లతో తైవాన్‌కు చెందిన పెగట్రాన్‌ స్మార్ట్‌ ఫోన్ల తయారీ కర్మాగారాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) శుక్రవారం ప్రారంభించారు. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ సమక్షంలో జరిగిన సభలో ఆయన పాల్గొన్ని కర్మాగారానికి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(Former Chief Minister Karunanidhi) హాయంలోనే హుండాయ్‌, ఫోర్డ్‌, మిత్సు బుషి వంటి అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలను నెలకొల్పాయని, అదే రీతిలో తన హయాంలో పెగట్రాన్‌ స్మార్ట్‌ ఫోన్ల  కర్మాగారం ఏర్పాటుకావడంతో తనకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కర్మాగారం ద్వారా 14 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించాయని, వీరిలో మహిళలే అధికమని స్టాలిన్‌ పేర్కొ న్నారు. పెగట్రాన్‌ సంస్థ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న 18 నెలల్లోనే కర్మాగారాన్ని ప్రారంభించడం సంతోషకరమ న్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామో అన్బరసన్‌, ఎంపీ సెల్వం, శాసనసభ్యులు రాజా, ఇ. కరుణానిధి, వరలక్ష్మి మధుసూదనన్‌, పెగట్రాన్‌ చైర్మన్‌ జెంగ్‌ జియాన్‌ జాంగ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లిన్‌ జియు డేన్‌, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌నాధ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-01T14:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising