ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: మీ పార్టీ వారే మీతో మాట్లాడటం లేదు...

ABN, First Publish Date - 2022-09-10T12:57:50+05:30

‘‘మీ పార్టీ ఎమ్మెల్యేలే మీతో మాట్లాడ్డం లేదు. ఇక మా పార్టీ ఎమ్మెల్యేలు మీతో ఎలా మాట్లాడతారు? ఎందుకు మీతో టచ్‌లో వుంటారు. మా పార్టీ ఎ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇక మా ఎమ్మెల్యేలు ఎలా మాట్లాడతారు? 

- ఈపీఎస్‏కు స్టాలిన్‌ చురకలు


చెన్నై, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘మీ పార్టీ ఎమ్మెల్యేలే మీతో మాట్లాడ్డం లేదు. ఇక మా పార్టీ ఎమ్మెల్యేలు మీతో ఎలా మాట్లాడతారు? ఎందుకు మీతో టచ్‌లో వుంటారు. మా పార్టీ ఎమ్మెల్యేల సంగతి సరే! ముందు మీ పార్టీ వారి సంగతి చూసుకోండి’’ అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (Edappadi Palaniswami)కి చురకలంటించారు. డీఎంకే ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారంటూ ఈపీఎస్‌ ఈ మధ్య కామెడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మదురైలోని కలైంజర్‌ అరంగంలో శుక్రవారం ఉదయం జరిగిన రిజిస్ట్రేషన్‌ల శాఖ మంత్రి మూర్తి కుమారుడి వివాహవేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తుగా ఓటమిపాలైన అన్నాడీఎంకే ప్రస్తుతం ఈపీఎస్‌ వర్గం ఓపీఎస్‌ వర్గం పేరుతో రెండుగా చీలిపోయిందన్నారు. అన్నింటికంటే మించి ఈపీఎస్‌ పార్టీలో తాత్కాలిక పదవిలో కొనసాగుతున్నారని, అలాంటి తాత్కాలిక నేతకు డీఎంకే(DMK) ని విమర్శించే హక్కులేదన్నారు. తన ఉనికి చాటుకోవడానికే డీఎంకే ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారంటూ ఈపీఎస్‌ హాస్యాస్పదమైన ప్రకటన చేశారన్నారు.ప్రజాసేవకే తగినంత సమయం సరిపోని పరిస్థితుల్లో వున్న తాను.. ఇలాంటి కామెడీ వ్యాఖ్యలను, విమర్శలను అస్సలు పట్టించుకోనన్నారు. మంత్రి మూర్తి పనితీరు గురించి స్టాలిన్‌(Stalin) మాట్లాడుతూ.. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల శాఖ లాభాల బాటలో పయనిస్తోందని, గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆ శాఖ 13,943 కోట్ల మేరకు ఆదాయాన్ని సంపాదించగలిగిందన్నారు. అంతేకాకుండా ప్రతి సోమవారం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్రజా విజ్ఞప్తుల దినం కూడా చక్కగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ వివాహవేడుకలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పొన్ముడి, ఎంపీ టీఆర్‌ బాలు, ఎమ్మెల్యే ఉదయనిధి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-10T12:57:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising