ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: మహిళలు నిర్వహించే స్టార్టప్‏లకు చేయూత

ABN, First Publish Date - 2022-12-31T08:05:01+05:30

రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ టెక్నాలజీ పాటించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి క

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- తొలి విడతగా రూ.5లక్షల సాయం

- అందజేసిన సీఎం

చెన్నై, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర చిన్న, మధ్య తరహా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో గ్రీన్‌ టెక్నాలజీ పాటించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేలా మహిళలు నిర్వహిస్తున్న 25 స్టార్టప్‌ కంపెనీలకు తొలి విడతగా తలా రూ.5లక్షల చొప్పున గ్రాంట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌(Chief Minister Stalin) అందజేశారు. రాష్ట్ర స్టార్టప్‌ సీడ్‌ గ్రాంట్‌ ఫండ్‌ కింద మహిళలు నిర్వహించే స్టార్టప్‏లకు ఇచ్చే గ్రాంట్‌ను రూ.10లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచారు. ఈ గ్రాంట్‌ను మూడు విడతలుగా అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు శుక్రవారం ఉదయం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తొలివిడత గ్రాంట్‌గా తలా రూ.5లక్షలను పదిమంది మహిళా పారిశ్రామికవేత్తలకు అందజేశారు. ఈ సందర్భంగా కొత్త స్టార్టప్‏లను ప్రారంభించదలచినవారి కోసం ‘మెంటర్‌ టీఎన్‌’ పేరుతో మార్గదర్శక సాఫ్ట్‌వేర్‌ వెబ్‌సైట్‌ను కూడా ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి దామో అన్బరసన్‌, ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ కార్యదర్శి వి.అరుణ్‌రాయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T08:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising