ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: అన్ని రంగాల్లో అభివృద్ధే మా ధ్యేయం

ABN, First Publish Date - 2022-12-09T08:37:52+05:30

అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి అన్నివర్గాలవారికీ సకల సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వధ్యేయమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- త్వరలో జిల్లాలవారీ తనిఖీలు

- తెన్‌కాశి సభలో సీఎం స్టాలిన్‌

చెన్నై, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి అన్నివర్గాలవారికీ సకల సదుపాయాలు కల్పించడమే తమ ప్రభుత్వధ్యేయమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ప్రకటించారు. తమ ప్రభుత్వం ప్రకటించిన ప్రజా సంక్షేపథకాలు ఎలా అమలవుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు అధికారులతో కలిసి త్వరలో జిల్లాల వారీ తనిఖీలు కూడా నిర్వహిస్తానని తెలిపారు. తెన్‌కాశిలో గురువారం ఉదయం జరిగిన బహిరంగ సభలో ఆ జిల్లాలో రూ. 22.20 కోట్లతో పూర్తయిన 57 పథకాలను ప్రారంభించి, రూ.34.14 కోట్లతో చేపట్టనున్న 23 కొత్త పథకాలకు శంకుస్థాపనచేశారు. వివిధ సంక్షేమ పథకాల కింద 1,03,508 లబ్దిదారులకు రూ.182.56 కోట్ల విలువైన సహాయాలను అందజేశారు. ముందుగా తెన్‌కాశి వేల్స్‌ విద్యాలయ స్కూలు ప్రాంగణంలో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ సందర్శించి, ఆ స్కూలో ఏర్పాటుచేసిన తిరువళ్లువర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ స్వాతంత్య్ర సమరయోధుడు పులిదేవన్‌ సైన్యాధ్యక్షుడిగా సేవలందించిన ఒండి వీరన్‌ జన్మించిన తెన్‌కాశిలో పర్యటించడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఉత్తరాదిలో కాశీనగరం ఉన్నట్లు దక్షిణాదిన కూడా అలాంటి నగరాన్ని రూపొందించిన ఘనత చక్రవర్తి పరాక్రమ పాండ్యన్‌కు దక్కిందని, ఆ స్ఫూర్తితోనే తెన్‌కాశి గోపురం నిర్మితమైందన్నారు. ఇంతటి చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెన్‌కాశి జిల్లా అందమైన జలపాతాలతో, నదులతో పశ్చిమకనుమలకు చేరువగా పచ్చదనంతో కళకళలాడుతోందన్నారు. ఇక డీఎంకే పాలనపై ప్రధానప్రతిపక్ష నాయకుడు పసలేని విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలకు స్పందించటం కన్నా ప్రజాసేవపై దృష్టిసారించడమే మంచిదని తాను భావిస్తున్నట్టు తెలిపారు. తెన్‌కాశి జిల్లా ప్రజల కోరిక మేరకు పుళియంకుడి శంకరన్‌కోయిల్‌ రహదారి అభివృద్ధికి నిధులు కేటాయిస్తానని, జిల్లా స్థాయి స్టేడియం నిర్మిస్తామని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పెరియసామి, రామచంద్రన్‌, రాష్ట్ర మైనారిటీల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు పీటర్‌ ఆల్ఫోన్స్‌, ఎంపీ ఎం.ధను్‌షకుమార్‌, ఎమ్మెల్యేలు ఎస్‌.పళనినాడార్‌, ఇ.రాజా, డాక్టర్‌ డి.సదన్‌ తిరుమలైకుమార్‌, ఎం.అబ్దుల్‌ వహాబ్‌, తిరునల్వేలి కార్పొరేషన్‌ మేయర్‌ పీఎం.శరవణన్‌, తెన్‌కాశి జిల్లా కలెక్టర్‌ పి.ఆకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T08:37:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising