Chief Minister: బాలమేధావికి సీఎం అభినందన
ABN, First Publish Date - 2022-12-07T08:16:14+05:30
చెన్నైకి చెందిన సుభిక్ష అనే పన్నెండేళ్ల బాలిక 196 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలాపించి ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది.
పుదుచ్చేరి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): చెన్నైకి చెందిన సుభిక్ష అనే పన్నెండేళ్ల బాలిక 196 దేశాలకు చెందిన జాతీయ గీతాలను ఆలాపించి ప్రపంచ రికార్డు నెలకొల్పనుంది. చెన్నైలోని హేమంత్, మోహన ప్రియ దంపతుల కుమార్తె సుభిక్షకు బాల్యం నుంచి సంగీతం నేర్పారు. ప్రస్తుతం సుభిక్ష గుర్తింపు కలిగిన 193 దేశాలతోపాటు మరో మూడు దేశాలు కూడా కలిపి మొత్తం 196 దేశాల జాతీయ గీతాలను ఆలవోకగా ఆలాపించి అందరినీ ఆశ్చర్య చకితుల్ని చేస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం పుదుచ్చేరికి తల్లిదండ్రులతోపాటు వెళ్ళిన సుభిక్ష ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.రంగసామి(Chief Minister N. Rangasamy)ని అక్కడి సచివాలయంలో కలుసుకోగా, ఆ చిన్నారిని పుదువై సీఎం అభినందించి, ఆశీర్వదించారు. ఆయన ఎదుట కొన్న దేశాల జాతీయ గీతాలను చక్కగా శ్రావ్యంగా పాడి మైమరపింపచేసింది.
Updated Date - 2022-12-07T08:16:16+05:30 IST