ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: భారత్‌ తోడో ఎవరో.. జోడో ఎవరో ప్రజలకు తెలుసు

ABN, First Publish Date - 2022-09-30T17:07:54+05:30

భారత్‌ తోడో ఎవరు చేస్తున్నారో... భారత్‌ జోడో ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                    - హావేరిలో సీఎం బొమ్మై


బెంగళూరు, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): భారత్‌ తోడో ఎవరు చేస్తున్నారో... భారత్‌ జోడో ఎవరు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసునని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) ఘాటుగా వ్యాఖ్యానించారు. సొంత జిల్లా హావేరిలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు గురువారం వచ్చిన ఆయన హెలిప్యాడ్‌లో మీడియాతో కొద్దిసేపు మీట్లాడారు. భారత్‌జోడో ఫ్లెక్సీలను చించేయడం వెనుక రాజకీయకుట్ర ఉందన్న కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌(DK Sivakumar) వ్యాఖ్యలపై స్పందించిన ఆయన ఇతర రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను చించేయాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలంటే ఎవరైనా ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టంచేశారు. సంఘవిద్రోహక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు రుజువైనందునే కేంద్రం పీఎఫ్ఐపై నిషేధం విధించిందని, ఈ సంస్థ రాజకీయ విభాగం ఎస్‌డీపీఐపై నిషేధానికి సంబంధించి రానున్న రోజుల్లో కేంద్రం పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు. సమాజంలో శాంతికి విఘాతం కలిగించే ఏ సంస్థ అయినా సరే నిరార్ధక్ష్యింగా చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం అన్నారు. పీఎ్‌ఫఐ నిషేధం రాజకీయ గిమ్మిక్‌ అంటూ విధానపరిషత్‌లో ప్రతిపక్ష నేత బీకే హరిప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ అయన నోటి ద్వారా ఇంతకంటే ఎలాంటి వాఖ్యానాలు వినగలమని ఎద్దేవా చేశారు. పీఎఫ్ఐ ఆగడాలు గత కొన్ని సంవత్సరాలుగా కళ్లముందే కనిపిస్తున్నాయని, కాంగ్రెస్‌(Congress) ఎమ్మెల్యేలు అఖండ శ్రీనివాసమూర్తి, తన్వీర్‌ సేఠ్‌ కూడా బాధితులేనని సీఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌ నేతలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వాస్తవాలను చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు. పీఎఫ్ఐ నిషేధం తర్వాత పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎక్కడా అవాంఛనీయ సంఘనటలు జరుగలేదని పేర్కొన్నారు. హింసను వదిలి ఆ సంస్థ పదాధికారులు, కార్యకర్తలు ప్రధాన జీవన స్రవంతిలోకి వస్తే తాము స్వాగతిస్తామన్నారు.

Updated Date - 2022-09-30T17:07:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising