Chief Minister: కొత్తగా 11 పవర్ డిస్ట్రిబ్యూషన్ జోన్లు
ABN, First Publish Date - 2022-12-16T07:41:48+05:30
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 విద్యుత్ పంపిణీ జోన్లను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) లాంఛనంగా ప్రా
- ప్రారంభించిన సీఎం
చెన్నై, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన 11 విద్యుత్ పంపిణీ జోన్లను ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) లాంఛనంగా ప్రారంభించారు. గురువారం సచివాలయం(Secretariat) నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటికి పచ్చజెండా వూపారు. రాష్ట్ర విద్యుత్ పంపిణీ కార్పొరేషన్‌లో ఇప్పటికే 176 డివిజన్లున్నాయి. లైన్ల మధ్య విద్యుత్ కనెక్షన్లు సమానంగా లేకపోవడంతో, పనిలో సమతుల్యత లోపించింది. దీంతో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో మండలాల మధ్య విద్యుత్ కనెక్షన్లను సమతుల్యం చేయడానికి, పరిపాలనా సమస్యల పరిష్కారానికి, రోజువారీ కార్యకలాపాలు వేగవంగా చేయడానికి అదనంగా మరో 11 విద్యుత్ పంపిణీ మండలాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చెన్నై జిల్లా చేపాక్కం, చెంగల్పట్టు జిల్లా షోళింగనల్లూర్, పల్లవరం, కృష్ణగిరి జిల్లా డెంకణికోట, ధర్మపురి జిల్లా పెన్నాగరం, విల్లుపురం జిల్లా తిరువెన్నెనల్లూర్, తిరుప్పూర్ జిల్లా ఉత్తుకుళి, దిండుగల్ జిల్లా వేడసందూర్, పెరంబలూర్ జిల్లా జయంకాండాం, విరుదునగర్ జిల్లా చతుర్, సేలం జిల్లా కెంగవల్లిలో ఈ పంపిణీ మండలాలను ఏర్పాటు చేసింది. వాటిని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ పొన్ముడి, యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఉదయనిధి, విద్యుత్‌శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T07:41:50+05:30 IST