ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెస్‌ ఒలింపియాడ్‌ ప్రచారాలతో 15 బస్సులు

ABN, First Publish Date - 2022-07-02T15:34:53+05:30

ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో ఈ నెల 28న 44వ అంతర్జాతీయ స్థాయి చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమవుతున్న సందర్భంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూలై 1 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ చారిత్రక, పర్యాటక ప్రాంతం మహాబలిపురంలో ఈ నెల 28న 44వ అంతర్జాతీయ స్థాయి చెస్‌ ఒలింపియాడ్‌ ప్రారంభమవుతున్న సందర్భంగా నగరంలో, పొరుగు జిల్లాల్లో ఆ క్రీడలపై ప్రచారం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ మేరకు చెస్‌ ఒలింపియాడ్‌ ప్రకటనలున్న 15 బస్సులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ మెరీనాబీచ్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సులకు మూడువైపులా ‘ఇది మన చెన్నై ఇదే మన్‌ చెస్‌’ ‘వణక్కమ్‌ చెస్‌ - వణక్కమ్‌ తమిళనాడు’ అనే నినాదాలను తమిళంలో, ఆంగ్లంలో చిత్రీకరించి ఉనానయి. అంతే కాకుండా ఈ క్రీడల వేదికగా ఉన్న మహాబలిపురం సముద్రతీర ఆలయ చిత్రాన్ని పెద్ద సైజులో పెయింటింగ్‌ చేశారు. నగరంలో తిరిగే ఐదు సిటీ బస్సులు, విల్లుపురం డిపోకు చెందిన పది ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు బస్సులను ఒలంపియాడ్‌ ప్రచార వాహనాలుగా మార్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, ఎస్‌ఎస్‌ శివశంకర్‌, మెయ్యనాధన్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, శాసనసభ్యుడు ఉదయనిధి స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T15:34:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising