ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennapuri Telugu Academy: ‘తెలుగువీర లేవరా’ సంపుటాల ఆవిష్కరణ

ABN, First Publish Date - 2022-10-03T14:03:40+05:30

చెన్నపురి తెలుగు అకాడమీ(Chennapuri Telugu Academy) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ‘తెలుగువీర లేవ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్యారీస్‌(చెన్నై), అక్టోబరు 2: చెన్నపురి తెలుగు అకాడమీ(Chennapuri Telugu Academy) ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ‘తెలుగువీర లేవరా’ పేరిట దివంగత తెలుగు ప్రముఖులు ఎన్జీ రంగా,  పీవీ నరసింహరావు, మోటూరి సత్యనారాయణలకు అంకితం చేస్తూ మూడు సంపుటాలను ఆదివారం సాయంత్రం ఆవిష్కరించారు. మైలాపూరుని ఓ హోటల్‌లో జ్యోతిప్రజ్వలనతో ప్రారంభమైన కార్యక్రమంలో అకాడమీ మేనేజింగ్‌ ట్రస్టి డా. తూమాటి సంజీవరావు స్వాగతోపన్యాసం చేశారు. ముఖ్య అతిథి, మాజీ ఐపీఎస్‌ అధికారి వి.చంద్రకిశోర్‌, విశిష్ట అతిథులు భారతి మహిళా కళాశాల విశ్రాంత తెలుగు ఆచార్యులు నిర్మలా పళనివేలు, ఆకాశవాణి చెన్నై కేంద్రం మాజీ సంచాలకులు వేణుగోపాల్‌రెడ్డి ఈ మూడు సంపుటాలను ఆవిష్కరించారు. తొలిప్రతులను దిట్టకవి అనంతపద్మనాభమూర్తి, మంగళాకందూర్‌, మునిరత్నంనాయుడు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రకిశోర్‌ మాట్లాడుతూ తెలుగువారినందరినీ మేల్కొలిపే రీతిలో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఆర్‌ సుబ్రహ్మణ్యం తెలుగువీర లేవారా పాటతోపాటు దేశభక్తి గీతాలను ఆలపించి సభికులను మైమరపించారు. గాయని వసుంధర, రంగస్థల కళాకారుడు కాకాని వీరయ్య తెలుగుగీతాలు, పద్యాలను ఆలాపించారు. కల్పనా గుప్తా నిర్వహణలోజరిగిన కార్యక్రమంలో అకాడమీ కార్యదర్శి తిరునగరి భాస్కర్‌ వందన సమర్పణ చేశారు.

Updated Date - 2022-10-03T14:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising