ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Travel: మెట్రోరైళ్లలో ఒకేరోజు 2.30 లక్షల మంది ప్రయాణం

ABN, First Publish Date - 2022-09-14T15:31:48+05:30

నగరంలో నడుపుతున్న మెట్రోరైళ్లలో(Metro trains) సోమవారం ఒకేరోజు అత్యధికంగా 2.30 లక్షల మంది ప్రయాణించారు. కరోనా తరువాత మెట్రో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 13: నగరంలో నడుపుతున్న మెట్రోరైళ్లలో(Metro trains) సోమవారం ఒకేరోజు అత్యధికంగా 2.30 లక్షల మంది ప్రయాణించారు. కరోనా తరువాత మెట్రో రైలు సేవలు క్రమంగా సాధారణ టైంటేబుల్‌ ప్రకారం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, మెట్రోరైళ్లలో నెలలవారీగా డఒకేరోజు ప్రయాణించిన వారి సంఖ్యను చెన్నై మెట్రోరైల్‌ లిమిటెడ్‌(Chennai Metrorail Limited) మంగళవారం విడుదల చేసింది. ఆ ప్రకారం, 1,91,720 మంది (మే 26వ తేది), 2,02,456 (జూన్‌ 3వ తేది), 1,97,307 (జూలై 27వ తేది), 2,20,089 మంది (ఆగస్టు 29వ తేది) ప్రయాణించారు. ఈ క్రమంలో, సీఎంఆర్‌ఎల్‌ చరిత్రలో ఈ నెల 12వ తేది ఒకేరోజు 2,30,611 మంది ప్రయాణించారు. వారిలో అత్యధికంగా పురచ్చి తలైవార్‌ ఎంజీ రామచంద్రన్‌ సెంట్రల్‌ మెట్రో రైల్వేస్టేషన్‌ నుంచి21,419 మంది, తిరుమంగళం రైల్వేస్టేషన్‌ నుండి 11,189, గిండీ రైల్వేస్టేషన్‌ నుండి 10,599, విమానాశ్రయం మెట్రో రైల్వేస్టేషన్‌ నుంచి 10,289 మంది ప్రయాణించనట్లు సీఎంఆర్‌ఎల్‌ తెలియజేసింది.


Updated Date - 2022-09-14T15:31:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising