ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai ఎయిర్‌పోర్టులో రన్‌వేల పునరుద్ధరణకు చర్యలు

ABN, First Publish Date - 2022-06-28T16:10:18+05:30

చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రెండు రన్‌వేలను కొత్తగా నిర్మించేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో రెండు రన్‌వేలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడయార్‌(చెన్నై), జూన్‌ 27: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉన్న రెండు రన్‌వేలను కొత్తగా నిర్మించేలా చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ ఎయిర్‌పోర్టులో రెండు రన్‌వేలు ఉన్నాయి. వీటిలో ఒకటి 3.66 కిలోమీటర్లు, రెండోది 2.89 కిలోమీటర్ల పొడువు ఉన్నాయి. మొదటి రన్‌వేపై పెద్ద విమానాలు టేకాఫ్‌, టేకాన్‌ అవుతుంటాయి. రెండో రన్‌వేను చిన్న రకం విమానాలకు వినియోగిస్తున్నారు. ఒక్కో రన్‌వేపై గంటకు 30 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ సంఖ్యకు 50కు పెంచేలా రన్‌వేలను కొత్తగా నిర్మించేలా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై ఎయిర్‌పోర్టు ఉన్నతాధికారులు మాట్లాడుతూ మొదటి రన్‌వే తరహాలోనే రెండో రన్‌వే పొడవును  పెంచేందుకు ఎయిర్‌ పోర్టు అథారిటీ గతంలోనే అనుమతి ఇచ్చింది. కానీ స్థల సేకరణ సమస్యలతో ఈ పనులు చేపట్టలేదు. చెన్నై ఎయిర్‌పోర్టుకు వచ్చే విమానాల సంఖ్య నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో రన్‌వేలను కూడా పునర్మించి రెండు రన్‌వేలను ఒకేసారి వినియోగించేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూం సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.  

Updated Date - 2022-06-28T16:10:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising