ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Runway: చెన్నై విమానాశ్రయ రన్‌వే పెంపు

ABN, First Publish Date - 2022-09-20T16:18:59+05:30

చెన్నై విమానాశ్రయంలో మొదటి రన్‌వే పొడవు పెంచారు. ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరో 400 మీటర్ల మేర పెంచడంతో మొత్తం రన్‌వే పొడవు 4,058

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                                 - ఇకపై ఎయిర్‌బస్‌ ఏ-380 విమానాలు ల్యాండింగ్‌


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 19: చెన్నై విమానాశ్రయంలో మొదటి రన్‌వే పొడవు పెంచారు. ప్రస్తుతం ఉన్న రన్‌వేను మరో 400 మీటర్ల మేర పెంచడంతో మొత్తం రన్‌వే పొడవు 4,058 కిలోమీటర్లకు పెరిగింది. ఫలితం గా 746 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఎయిర్‌ బస్‌ ఏ-380 విమానాలు కూడా ఇకపై ల్యాండింగ్‌ అవుతుంది. ఈ విమానాశ్రయం మొత్తం 1350 ఎకరాల్లో ఉండగా, ఈ విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. దీంతో ఈ విమానాశ్రయాన్ని రూ.2400 కోట్లతో ఆధునికీకరించారు. పైగా ఈ విమానాశ్రయం విస్తరణ కోసం జూన్‌లో పల్లావరం, పరింగిమలై ప్రాంతాల్లో మరో 21.24 ఎకరాలను కూడా సేకరించారు. అయితే, ఈ విమానాశ్రయంలో రెండు రన్‌వేలున్నాయి. వీటిలో ఒక రన్‌వే 3,658 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పు, 2వ రన్‌వే 2,890 మీటర్ల పొడవు. 45 మీటర్ల వెడల్పుతో ఉంది. ఇందులో మొదటి రన్‌వే పొడవును మరో 400 మీటర్ల మేరకు పెంచారు. ఫలితంగా ఈ రన్‌వేపై ఎయిర్‌ బస్‌ ఏ380 వంటి విమానాలు సైతం ల్యాండ్‌ అయ్యేందుకు అవకాశం లభించింది. ఈ తరహా విమానాలు ఇప్పటివరకు ఇక్కడ ల్యాండ్‌ కాలేదు. దేశంలో ఢిల్లీ, ముంబై, బెంగుళూరు(Delhi, Mumbai, Bangalore) విమానాశ్రయాల్లో మాత్రమే ఏ380 విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయి. 

Updated Date - 2022-09-20T16:18:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising