ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai ఎయిర్‌పోర్టులో కొత్త యంత్రాలు

ABN, First Publish Date - 2022-01-09T15:20:29+05:30

స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ లగేజీల చెక్‌-ఇన్‌ కోసం గంటల తరబడి బారులు తీరే పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త యంత్రాలు అమర్చి లగేజీ పద్ధతిని సులభతరం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- లగేజీ చెకింగ్‌ సులభతరం 

- ప్రయాణికులకు ఉపసమనం


చెన్నై: స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ లగేజీల చెక్‌-ఇన్‌ కోసం గంటల తరబడి బారులు తీరే పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త యంత్రాలు అమర్చి లగేజీ పద్ధతిని సులభతరం చేశారు. ఈ రెండు విమానాశ్రయాలలో చెక్‌-ఇన్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు క్యూలైన్లలో నిలిచేవారు. ఈ పద్ధతి వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ పరిస్థితిని సులభతరం చేయడానికి విమానాశ్రయ అధికారులు ఎనిమిది కొత్త యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇకపై బోర్డింగ్‌ పాసు తీసుకునేటప్పుడే ఈ కొత్త ఆటోమేటిక్‌ యంత్రాల ద్వారా నెంబర్లు కలిగిన స్టిక్కర్లు పొందాల్సి వుంటుంది. ఆ స్టిక్కర్లను ప్రయాణికులు తమ లగేజీ బ్యాగ్‌లు, సూట్‌ కేసులపై అతికించుకోవాలి. స్టిక్కర్లు అతికించిన బ్యాగ్‌లను ప్రయాణికులు విమానాల వద్దకే తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా ప్రయాణికులు తమ లగేజీలను వెదుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాటిపై అతికించిన స్టిక్కర్లను చూసి తీసుకోగలుగుతారు. ఈ పద్ధతి వల్ల ప్రయాణికులు చెక్‌-ఇన్‌ పేరిట ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ యంత్రాలను ఉపయోగించుకునే ప్రయాణీకుల సంఖ్యను బట్టి వాటి సంఖ్యను అధికం చేస్తామన్నారు.

Updated Date - 2022-01-09T15:20:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising