ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

HIV Positive : వారాణసీలో ఇద్దరికి హెచ్ఐవీ పాజిటివ్.. ఎలా వచ్చిందో తెలిస్తే షాకే..

ABN, First Publish Date - 2022-08-07T03:16:40+05:30

ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని వారాణసీలో కొందరు వ్యక్తులు ఇటివల అనారోగ్యం పాలయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌(Uttarpradesh)లోని వారాణసీలో కొందరు వ్యక్తులు ఇటివల అనారోగ్యం పాలయ్యారు. కారణం ఏంటో పసిగట్టేందుకు టైఫాయిడ్, మలేరియా సహా పలు వైద్య పరీక్షలు నిర్వహించగా ఏమీ తేలలేదు. అయితే ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో హెచ్‌ఐవీ పరీక్ష నిర్వహించగా షాకింగ్‌కు గురిచేస్తూ ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. 20 ఏళ్ల యువకుడు, పాతికేళ్ల యువతికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా (HIV Positive) నిర్ధారణ అయ్యింది. అయితే వీరిద్దరికీ హెచ్‌ఐవీ పాజిటివ్ రోగులతో సంబంధం లేదు. అంతేకాదు ఎయిడ్స్ ఉన్నవారితో లైంగికంగా కలవలేదు, హెచ్ఐవీ సోకినవారి రక్తమార్పిడి కూడా జరగలేదు. మరి ఎక్కడ సోకిందో తెలియక ఆలోచిస్తున్నవారిలో ఒకే ఒక్క ఉమ్మడి అంశం ఉంది. అదేంటంటే ఇటివలే పచ్చబొట్టు పొడిపించుకున్నారు. దర్యాప్తు చేయగా ఒకే వ్యక్తి వద్ద పచ్చబొట్టు పొడిపించుకున్నట్టు తేలింది. టాటూ పార్లర్లలో ఒకే సూదిని అందరికీ ఉపయోగించడంతో ఈ పరిణామం ఉత్పన్నమైంది. 


ఈ ఘటనపై పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ప్రీతి అగర్వాల్ స్పందించారు. పచ్చబొట్టు పొడవడానికి ఉపయోగించే సూదులు అధిక ధర ఉంటాయన్నారు. ఆ భారాన్ని తప్పించుకునేందుకు పచ్చబొట్టు కళాకారులు ఒకే సూదిని ఎక్కువమందిపై వాడుతున్నారని వివరించారు. తక్కువ ధరకే టాటూ వేస్తామంటే నమ్మొద్దని హెచ్చరించారు. పచ్చగొట్టు పడిపించుకునే ముందు సూది కొత్తదో కాదో తెలుసుకోవాలని ఆమె సూచించారు.

Updated Date - 2022-08-07T03:16:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising