ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Partha Chatterjee: సీఎం మమతా బెనర్జీకి 3 సార్లు కాల్ చేసిన పార్థ ఛటర్జీ

ABN, First Publish Date - 2022-07-25T17:58:03+05:30

స్కూల్ జాబ్స్ స్కాంలో (School Job Scams) అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి కాల్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: స్కూల్ జాబ్స్ స్కాంలో (School Job Scams) అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ (Partha Chatterjee) ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి కాల్ చేశారు. కానీ ఆమె సమాధానం ఇవ్వలేదు. శనివారం ఈడీ అరెస్ట్ చేశాక సీఎంకు 3 సార్లు కాల్స్ చేశారని, అయితే అవతలివైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని ‘అరెస్ట్ మెమో’లో పోలీసులు పేర్కొన్నారు. కాగా పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. అదే రోజు రాత్రి అంటే జులై 22, 23 తేదీల మధ్య రాత్రి 2.30 ఒకసారి, 3.37 నిమిషాలకు రెండోసారి, ఉదయం 9.35 గంటల మధ్య మొత్తం 3 సార్లు మమతా బెనర్జీకి ఛటర్జీ ఫోన్లు చేశారు. తమవారికి అరెస్ట్ సమాచారాన్ని అందించేందుకు అవకాశం ఇవ్వగా.. సీఎంకు కాల్ చేసేందుకు సిద్ధపడ్డారని తెలిపారు. కాగా నిందిత వ్యక్తులు తమ అరెస్ట్ సమాచారాన్ని తెలియజేసేందుకు బంధువులు లేదా స్నేహితులకు ఫోన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు వెల్లడించారు. కాగా పార్థ ఛటర్జీ ఫోన్‌ను అప్పటికే ఈడీ అధికారుల జప్తులో ఉంది. 


కాగా స్కూల్ జాబ్స్ స్కాంలో పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ముఖర్జీ ఇంట్లో రూ.20 కోట్ల నగదును ఈడీ అధికారులు ఇటివల గుర్తించారు. ఈ కేసుతో సంబంధమున్న మంత్రి పార్థ ఛటర్జీని శనివారం అరెస్ట్ చేశారు. ఆయన ప్రస్తుతం 2 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. కోల్‌కతా హైకోర్ట్ ఆదేశాల ప్రకారం.. ఈడీ అధికారులు సోమవారం ఉదయమే పార్థ ఛటర్జీని భువనేశ్వర్‌లోని ఏయిమ్స్‌కు విమానం ద్వారా తరలించారు. హాస్పిటల్‌లో వైద్యపరీక్షలు పూర్తయ్యాక వర్చూవల్‌గా కోర్టులో ప్రవేశపెట్టాలని కోల్‌కతా హైకోర్ట్ ఆదేశించింది.


వెంటనే హాస్పిటల్‌లో చేర్పించాల్సిన అసవరం లేదు

మంత్రి పార్థ ఛటర్జీ దీర్ఘకాలిక వ్యాధులో బాధపడుతున్నారని, అయితే తక్షణమే హాస్పిటల్లో చేర్పించాల్సిన అవసరం ఏమీలేదని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. వేర్వేరు వైద్యపరీక్షలు నిర్వహించామని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆశ్‌తోష్ బిశ్వాస్ వెల్లడించారు.

Updated Date - 2022-07-25T17:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising