ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Letter to Sonia Gandhi : ‘‘నేనొక్కడినే యాదవ ఎమ్మెల్యేని... నాకు మంత్రి పదవి ఇప్పించండి...’’

ABN, First Publish Date - 2022-08-12T21:23:19+05:30

బిహార్‌ (Bihar)లో నూతన ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో తనకు మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా : బిహార్‌ (Bihar)లో నూతన ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇప్పించాలని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ (Sonia Gandhi)కి లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో యాదవ (Yadav) సామాజిక వర్గానికి చెందినవాడిని తాను ఒక్కడినేనని, తనకు మంత్రి పదవి ఇస్తే, ఓబీసీ (OBC)లకు బలమైన సందేశాన్ని పంపవచ్చునని తెలిపారు. 


బిహార్‌లోని ఖగారియా సదర్ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఛత్రపతి యాదవ్ (Chatrapati Yadav) శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి లేఖలు రాశానని చెప్పారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో తనకు మంత్రి పదవి ఇప్పించాలని కోరానని చెప్పారు. బిహార్‌లో ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తాను మాత్రమే యాదవ సామాజిక వర్గానికి చెందినవాడినని, తనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇతర వెనుకబడిన వర్గాలకు బలమైన సందేశాన్ని పంపవచ్చునని తెలిపానని చెప్పారు.


తన తండ్రి రాజేంద్ర ప్రసాద్ యాదవ్ (Rajendra Prasad Yadav) గతంలో ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పని చేశారని చెప్పినట్లు తెలిపారు. బిందేశ్వరి దూబే, భగవత్ ఝా ఆజాద్, జగన్నాథ్ మిశ్రాల మంత్రివర్గాల్లో తన తండ్రి మంత్రిగా పని చేశారని తెలిపినట్లు వివరించారు. 


బిహార్‌లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌కు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కాంగ్రెస్‌కు నాలుగు మంత్రి పదవులు లభించే అవకాశం ఉంది. 


బిహార్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా (Madan Mohan Jha) తెలిపిన వివరాల ప్రకారం, ఎవరికి మంత్రి పదవులు ఇస్తారు? ఎందరికి ఇస్తారు? అనే అంశాలను అధిష్ఠాన వర్గమే నిర్ణయిస్తుందని చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 


బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఎనిమిదోసారి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గాన్ని విస్తరించవలసి ఉంది. 


Updated Date - 2022-08-12T21:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising