ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NEET PG 2021: ఖాళీగా ఉన్న 1456 మెడికల్ సీట్లను ప్రస్తుతం భర్తీ చేయలేమని సుప్రీంకు కేంద్రం స్పష్టీకరణ

ABN, First Publish Date - 2022-06-09T03:14:32+05:30

మెడికల్ కాలేజీలలో జాతీయ కోటాలో 1456 ఖాళీ సీట్ల భర్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఖాళీగా ఉన్న 1456 మెడికల్ సీట్లను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మెడికల్ కాలేజీలలో జాతీయ కోటాలో 1456 ఖాళీ సీట్ల భర్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఖాళీగా ఉన్న 1456 మెడికల్ సీట్లను ప్రస్తుతం భర్తీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నీట్ 2021 కోసం ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌ను నిలిపివేసినట్లు అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది. ఇప్పుడు ఆ సీట్ల భర్తీ వ్యవహారం చేపడితే నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్‌కు అంతరాయం కలుగుతుందని కేంద్రం సుప్రీంకు వివరించింది. నీట్‌ పిజి-2021లో DNB కోర్సు కౌన్సెలింగ్‌ను చేర్చనందున సీట్లు పెంచినట్లు కేంద్రం తెలిపింది. 1456 మెడికల్ సీట్లు ఖాళీగా ఎందుకు ఉంచారో, ఎందుకు భర్తీ చేయలేదో ఈరోజే సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని బుధవారం ఉదయం సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో.. ధర్మాసనం ఆదేశాలకు స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సీట్ల భర్తీ వ్యవహారంపై అఫిడవిట్‌ దాఖలు చేసింది.

Updated Date - 2022-06-09T03:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising