ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fake, Anti-India Content : 8 యూట్యూబ్ చానళ్ళపై కేంద్రం వేటు

ABN, First Publish Date - 2022-08-18T19:38:35+05:30

భారత దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఎనిమిది యూట్యూబ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత దేశానికి వ్యతిరేకంగా పని చేస్తున్న ఎనిమిది యూట్యూబ్ చానళ్ళ (YouTube channels)ను కేంద్ర ప్రభుత్వం గురువారం నిషేధించింది. వీటిలో ఒకటి పాకిస్థాన్ (Pakistan) నుంచి పని చేస్తోంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్, (Information Technology Rules) 2021 ప్రకారం ఈ చర్యలు తీసుకుంది. ఈ చానళ్ళ వ్యూవర్‌షిప్ 114 కోట్లకు పైగానే ఉంది. 85.73 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ కంటెంట్ మానిటైజ్ అయింది. ఈ వివరాలను సమాచార, ప్రసార  మంత్రిత్వ శాఖ ఓ ప్రటకనలో వెల్లడించింది. 


Information and Broacasting Ministry ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, ఈ యూట్యూబ్ చానళ్లు భారత దేశానికి వ్యతిరేక కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నాయి. మత సామరస్యాన్ని దెబ్బతీసేవిధంగానూ, ప్రజా శాంతికి విఘాతం కలిగించే విధంగానూ, భారత దేశ విదేశీ సంబంధాలు దెబ్బతినే విధంగానూ ఈ చానళ్ళలోని వీడియోలలో ప్రకటనలు ఇస్తున్నారు. 


భారత ప్రభుత్వం మతపరమైన కట్టడాలను కూల్చేస్తోందని, మతపరమైన పండుగలను జరుపుకోవడంపై నిషేధం విధిస్తోందని, మత యుద్ధాన్ని ప్రకటించిందని ఈ చానళ్ళు ప్రసారం చేస్తున్నాయని ఈ ప్రకటన తెలిపింది. భారత సైన్యం (Indian Army), జమ్మూ-కశ్మీరు (Jammu and Kashmir) వంటి అంశాలపై తప్పుడు, బూటకపు వార్తలను ప్రసారం చేస్తున్నాయని పేర్కొంది. ఇటువంటి కంటెంట్ వల్ల దేశంలో మత సామరస్యం దెబ్బతింటుందని, ప్రజాశాంతికి విఘాతం కలుగుతుందని గుర్తించినట్లు తెలిపింది. ఈ చానళ్ళు ప్రసారం చేస్తున్న కంటెంట్ పూర్తిగా తప్పుడు కంటెంట్ అని, ఇది దేశ భద్రత, విదేశాలతో భారత దేశానికిగల స్నేహ సంబంధాలకు విఘాతం కలిగిస్తుందని గుర్తించినట్లు తెలిపింది. 


కేంద్ర ప్రభుత్వం నిషేధించినవాటిలో ఓ ఫేస్‌బుక్ ఖాతా (Facebook Account), రెండు ఫేస్‌బుక్ పోస్ట్‌లు కూడా ఉన్నాయి. వీటన్నిటి లక్ష్యం భారత దేశంలో వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలించడమేనని గుర్తించడంతో వీటిపై వేటు పడింది. 


Updated Date - 2022-08-18T19:38:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising