ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆగస్టులో కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీరణ... తెలంగాణ నుంచి ఒకరికి ఛాన్స్

ABN, First Publish Date - 2022-07-21T23:42:24+05:30

న్యూఢిల్లీ: ఆగస్టులో కేంద్ర క్యాబినెట్ పునర్వవస్థీకరణ జరగనుందని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల తరువాత క్యాబినెట్ విస్తరణ జరిగొచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆగస్టులో కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీరణ (central cabinet expansion) జరగనుందని తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల తరువాత క్యాబినెట్ విస్తరణ జరగొచ్చని బీజేపీ(bjp) వర్గాలు చెబుతున్నాయి. మైనార్టీ శాఖ మంత్రి నఖ్వీతో పాటు పలువురి రాజీనామాతో మోదీ (modi) క్యాబినెట్‌లో పలు ఖాళీలు ఏర్పడ్డాయి. క్యాబినెట్ విస్తరణలో ఏక్ నాధ్ షిండే వర్గం ఎంపీలకు స్థానం దక్కనుందని సమాచారం. శివసేన (shiv sena)కు రెండు మంత్రి పదవులు కేటాయిస్తారని తెలుస్తోంది.


తెలంగాణ నుంచి ఒకరికి కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం ఉందని బీజేపీ వర్గాల ద్వారా సమాచారం. డాక్టర్ కే లక్ష్మణ్( dr k laxman)కు చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. డాక్టర్ కే లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు. ఇటీవలే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. బీసీలకు పెద్దపీట వేయడంలో భాగంగా ఆయనకు అవకాశం ఇస్తున్నారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇప్పటికే జీ.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం ఇవ్వడం ప్లస్ పాయింట్ అవుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 


కేంద్ర కేబినెట్‌లో ఎంపీలు జీవీఎల్ నరసింహారావు, సీఎం రమేశ్‌లకు చోటు దక్కవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.  

Updated Date - 2022-07-21T23:42:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising