ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

ABN, First Publish Date - 2022-08-18T03:44:01+05:30

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతన్నలు తీసుకునే 3 లక్షల రూపాయల లోపు రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి 2024-25 వరకూ ఇది వర్తిస్తుంది. దీనివల్ల కేంద్రంపై 34,856 కోట్ల రూపాయల భారం పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకుర్ తెలిపారు. వ్యవసాయ రంగానికి రుణ లభ్యత పెరుగుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రైతులు తీసుకునే స్వల్పకాలిక రుణాలకు గతంలోలాగే 4శాతం వడ్డీ వర్తిస్తుందన్నారు. 


కోవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆతిథ్య రంగానికి ఊతమిచ్చేలా మరో కీలక నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ప్రకటించింది. హాస్పిటాలిటీ అనుబంధ రంగ సేవలందించే సంస్థలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ప్రకటించింది. దీని ద్వారా అందిస్తున్న నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలకు అదనంగా మరో 50 వేల కోట్లు కేటాయించింది. ఈ స్కీమ్ కింద 2022 ఆగస్ట్ 5 వరకూ 3.67 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేశామని అనురాగ్ సింగ్ ఠాకుర్ తెలిపారు.



Updated Date - 2022-08-18T03:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising