ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిమెంట్‌ ధరలకు రెక్కలు.. ఎంత పెరగనుందో తెలిస్తే...

ABN, First Publish Date - 2022-01-21T17:53:57+05:30

సిమెంట్‌ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. బ స్తాకు రూ.30 వరకూ పెరుగునుందని మా ర్కెట్‌ వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. గత వారం క్రితమే ఇనుము ధర టన్నుకు రూ. 6వేల వరకూ పెరిగింది. ఇప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- బస్తాపై రూ. 30 పెరగనున్నట్లు వ్యాపార వర్గాల ప్రకటన

- వారం క్రితమే పెరిగిన ఇనుము ధర

- గృహనిర్మాణదారులు, కాంట్రాక్టర్ల్లపై భారం


బళ్లారి(బెంగళూరు): సిమెంట్‌ ధరకు మళ్లీ రెక్కలొచ్చాయి. బస్తాకు రూ.30 వరకూ పెరుగునుందని మార్కెట్‌ వ్యాపారవర్గాలు పేర్కొన్నాయి. గత వారం క్రితమే ఇనుము ధర టన్నుకు రూ. 6వేల వరకూ పెరిగింది. ఇప్పుడు సిమెంట్‌ ధర కూడా పెరుగుతుండడం వల్ల నిర్మాణ రంగంపై మోయలేని భారం పెరగనుంది. ప్రస్తుతం భారతి సిమెంట్‌ బస్తా(50 కేజీలు) రూ. 370, చిట్టువీడు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌లతోపాటు ఇతర ఓపీసీ, సిమెంట్‌ ధర ఇంచుమించు రూ.370 ఉంది. దీని రేటు 400 వరకూ అంటే బస్తాకు రూ.30 పెరగనున్నట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఇనుము ధర టన్ను రూ.60 వేల వరకూ ఉండేది. వారం రోజుల క్రితం వీటి ధర రూ.66 వేలకు పెంచారు. ప్రస్తుతం ధరలు పెరుగుదలకు ప్రధానంగా బొగ్గు ధర పెరగడమే కారణం అని వ్యాపార వర్గలు అంచనా వేస్తున్నాయి. బొగ్గు టన్నుపై రూ. 10 వేల వరకూ పెరిగిందని సమాచారం. ఇక వేసవి ప్రారంభం కానుంది. దీనితో చాలా మంది పేద, మధ్యతరగతి వాళ్లు ఇళ్లు కట్టుకోవడంతో పాటు ప్రభుత్వ భవనాలు, నీటి ప్రాజెక్టులు, ఇతర నిర్మాణ పనులు జరుగుతాయి. ఇలాంటి సమయంలో ధరలు పెరుగుదలతో సామాన్య జనం పైనా తీరని బారం పడనుంది. మధ్యతరగతి వర్గాల చిరకాల స్వప్నం సొంతింటి నిర్మాణం. అలాంటి మధ్యతరగతి వారికి పెరిగిన ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. అప్పో, సప్పో చేసి ఇళ్లు కట్టుకోవాలనుకుంటున్న సామాన్యుడికి సిమెంట్‌ ధరలు చెమటలు పట్టించక మానవు.


బొగ్గు ధర పెంపుతోనే..:

- తమ్మినేని రాజారావు, గజేంద్ర ఐరన్‌ మార్ట్‌

సిమెంట్‌ ధర పెరుగుతున్నట్లు కంపెనీల నుంచి సంకేతాలు అందాయి. వివిద కంపెనీల బట్టి సిమెంట్‌ బస్తాకు రూ. 30 వరకూ పె రగనుంది. ప్రస్తుతం బస్తా సిమెంట్‌ కంపెనీల బట్టి రూ.370 ఉంది. దీన్ని రూ. 400 వరకూ చేయాలని కంపెనీలు నిర్ణయించాయి. ధరల పెంపుకు బొగ్గు ధరల పెంపే కారణం. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరింత పెరిగే అవకాశం ఉంది. వీటికితోడు వారం క్రితమే ఐరన్‌ ధర టన్నుకు రూ.6 వేల వరకూ పెరిగింది. గతంలో రూ.60 వేలవరకూ టన్ను ఇనుము ఉండేది. ప్రస్తుతం రూ.66 వేల వరకూ పెరిగింది. ఇనుము కూడా పెరిగే అవకా శం ఉన్నట్లు వ్యాపార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఇది సామాన్యుడికి చేదు వార్తే..!

Updated Date - 2022-01-21T17:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising