ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CCPA: హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లే వాళ్లు ఈ విషయం తెలిస్తే పండగ చేసుకుంటారు..

ABN, First Publish Date - 2022-07-05T01:56:36+05:30

హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లేవారికి భారీ ఊరట లభించే విధంగా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హోటల్స్‌, రెస్టారెంట్స్‌లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హోటల్స్, రెస్టారెంట్స్‌కు వెళ్లేవారికి భారీ ఊరట లభించే విధంగా కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై హోటల్స్‌, రెస్టారెంట్స్‌లో సర్వీస్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా గానీ, ఫుడ్ బిల్‌లో కలిపి వసూలు చేయడం గానీ చేయరాదని కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సర్వీస్ ఛార్జీని వినియోగదారుల నుంచి వసూలు చేయడంపై నిషేధం విధించింది. కస్టమర్స్ సర్వీస్ ఛార్జ్ అనేది వినియోగదారులు స్వచ్ఛందంగా ఇస్తే తీసుకోవాలి గానీ వసూలు చేయరాదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి హోటల్స్, రెస్టారెంట్లకు తాజాగా కొన్ని మార్గదర్శకాలను Central Consumer Protection Authority (CCPA) విడుదల చేసింది. అవేంటంటే..


* హోటల్స్, రెస్టారెంట్లు సర్వీస్ ఛార్జ్ విధించడాన్ని నిషేధించడమైనది.

* తినడానికి వచ్చిన కస్టమర్లను సర్వీస్ ఛార్జ్ చెల్లించాల్సిందేనని బలవంతం చేయరాదు.

* హోటల్స్, రెస్టారెంట్లకు వచ్చే వినియోగదారులకు సర్వీస్ ఛార్జ్ అనేది స్వచ్ఛందమని, ఆప్షనల్ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి.

* ఇతర ఏ పేరుతోనూ సర్వీస్ ఛార్జ్‌ను విధించేందుకు హోటల్స్, రెస్టారెంట్స్ ప్రయత్నించకూడదు.

* సర్వీస్ ఛార్జ్ చెల్లిస్తేనే లోపలకు అనుమతిస్తామని ఏ హోటల్ లేదా రెస్టారెంట్ వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు.

* ఫుడ్ బిల్లులో గానీ, జీఎస్టీ ఛార్జీల్లో గానీ సర్వీస్ ఛార్జ్‌ను కలిపి వసూలు చేసేందుకు హోటల్స్, రెస్టారెంట్స్ సాహసించరాదు.



CCPA తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాలివి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించి ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ సర్వీస్ ఛార్జ్ వడ్డనకు పాల్పడితే బిల్ అమౌంట్ నుంచి సర్వీస్ ఛార్జ్‌ను తొలగించాలని సదరు వినియోగదారుడు కోరవచ్చు. అప్పటికీ అందుకు ఆ హోటల్ లేదా రెస్టారెంట్ యాజమాన్యం సిద్ధపడకపోతే సదరు యాజమాన్యంపై నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌‌లో (NCH) ఫిర్యాదు చేయవచ్చు. NCH హెల్ప్‌లైన్ నంబర్ 1915కు గానీ, NCH మొబైల్ యాప్‌లో గానీ ఫిర్యాదు చేయవచ్చని Central Consumer Protection Authority స్పష్టం చేసింది.

Updated Date - 2022-07-05T01:56:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising