ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిల్లి అనుకుని భ్రమపడ్డారు.. చిరుతపిల్ల అని తెలిసి భయపడ్డారు

ABN, First Publish Date - 2022-04-27T15:26:20+05:30

నీలగిరి జిల్లా గూడలూరు వద్ద తేయాకు తోటలో పనిచేసే కార్మికులు కొందరు ఓ పొదలమాటున వున్న చిరుతపులిని పిల్లిగా భావించి తీసుకెళ్లారు. స్థానికులు పరిశీలించి అది పిల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: నీలగిరి జిల్లా గూడలూరు వద్ద తేయాకు తోటలో పనిచేసే కార్మికులు కొందరు ఓ పొదలమాటున వున్న చిరుతపులిని పిల్లిగా భావించి తీసుకెళ్లారు. స్థానికులు పరిశీలించి అది పిల్లి కాదు చిరుతపులి పిల్ల అని చెప్పటంతో వారు దిగ్ర్భాంతి చెందారు. మంగళవారం ఉదయం పులంపట్టి ప్రాంతంలోని తేయాకుతోటలో పనిచేయడానికి కొందరు కార్మికులు వెళ్ళారు. ఆ సమయంలో ఓ పొదలమాటున రెండు మూడు రోజులకు ముందు పుట్టిన చిరుత పిల్ల కనిపించింది. దానిని పిల్లిగా భావించిన కార్మికులు ఇంటిలో పెంచుకుందామని తీసుకెళ్ళారు. స్థానికులు గమనించి అది పిల్లి కాదు చిరుతపులి అని నిర్ధారించడంతో వెంటనే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలిపారు. వారు హుటాహుటిన అక్కడికి వెళ్ళి చిరుతపులి పిల్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతపులి పిల్ల ఉన్న ప్రాంతానికే తీసుకెళ్ళి  ఉంచారు. ఈ విషయమై అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ఆ పిల్ల తల్లి ఆహారం కోసం వెళ్తూ దానిని పొదలమాటున దాచి ఉంటుందని, తన పిల్లను వెదుక్కుంటూ ఇదే ప్రాంతానికి ఎప్పుడైనా వస్తుందని చెప్పారు. ఆ చిరుత రాకకోసం అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలో నిఘా వేస్తారని చెప్పారు.

Updated Date - 2022-04-27T15:26:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising