ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముసలావిడని కొట్టి కారు లాక్కున్నాడు.. కానీ చచ్చిపోయాడు.. ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2022-04-21T03:19:19+05:30

శాన్‌ఆంటోనియో : ఏడు పదుల వయసు దాటిన పెద్దావిడపై అన్యాయంగా దాడి చేసి కారు లాక్కెళ్లిన దొంగ అదే కారులో మరణించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌ఆంటోనియో : ఏడు పదుల వయసు దాటిన పెద్దావిడపై అన్యాయంగా దాడి చేసి కారు లాక్కెళ్లిన దొంగ అదే కారులో మరణించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. దొంగిలించిన కారు ప్రమాదానికి గురవ్వడంతో దుండగుడు కారులోనే చనిపోయాడు. ఈ ఘటన అమెరికాలోని శాన్‌ఆంటోనియోలో పోయినవారం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. గత మంగళవారం షిర్లెనె హెర్నాండెజ్(72) డైట్ కోక్ కొనేందుకు గ్యాస్ స్టేషన్‌కు వెళ్తుండగా దుండగుడు ఆమెపై దాడి చేశాడు. కారు తాళాలు లాక్కునే క్రమంలో ముసలావిడ మొహంపై పిడిగుద్దులు గుద్దాడు. సమీపంలోని ముగ్గురు వ్యక్తులు దాడి జరుగుతోందని పసిగట్టి దగ్గరకు వచ్చేలోపే కారు తీసుకుని దొంగపారిపోయాడు. కారును వేగంగా  నడిపాడు. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే తెలిసిందేంటంటే అదే కారులో దొంగ కథ విషాదాంతమైంది. హైవేపై కారు ప్రమాదానికి గురయింది. కారులోనే  అతడు చనిపోయాడు. ఈ ప్రమాదం గ్యాస్ స్టేషన్‌కు దగ్గరలోనే జరిగింది. చేసిన పాపాలు చుట్టుకుంటాయని చాలా మంది చెబుతుంటారు. కానీ తాను నమ్మబోనని హెర్నాండెజ్ చెప్పారు. ప్రమాదంలో దొంగ చనిపోవడం నిజంగా బాధాకరమని ఆమె అన్నారు. కాగా ఇప్పుడిప్పుడే ఆమె కోలుకుంటున్నారు.

Updated Date - 2022-04-21T03:19:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising