ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Arpita Mukherjee: ఎస్ఎస్‌సీ స్కాంలో వెలుగుచూస్తున్న అర్పితాముఖర్జీ లీలలు

ABN, First Publish Date - 2022-08-04T14:00:08+05:30

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఎస్ఎస్‌సీ కుంభకోణం (SSC scam case)లో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ(Arpita Mukherjee) లీలలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మూడు కంపెనీలకు డైరెక్టర్...కారు డ్రైవర్ కూడా కో డైరెక్టర్

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వెలుగుచూసిన ఎస్ఎస్‌సీ కుంభకోణం (SSC scam case)లో కీలక నిందితురాలైన అర్పితాముఖర్జీ(Arpita Mukherjee) లీలలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నాయి.(arpita mukherjee news update)మోడల్, నటి అయిన అర్పితా ముఖర్జీ మూడు కంపెనీల్లో(three companies) డైరెక్టరు(director) అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) దర్యాప్తులో వెల్లడైంది. కోల్‌కతా నగరానికి చెందిన కల్యాణ్ ధర్ అనే వ్యక్తి కూడా అర్పితాముఖర్జీ(arpita mukherjee ed) మూడు కంపెనీల్లో కో డైరెక్టరని తేలింది. 


కల్యాణ్ ధర్ గురించి ఆరా తీస్తే ఆయన నిజ జీవితంలో కారు డ్రైవరుగా(car driver) పనిచేస్తున్నారని పరిశోధనలో వెలుగుచూసింది. ఓ కారు డ్రైవరు కోట్లాది రూపాయల టర్నోవరు ఉన్న అర్పితాముఖర్జీకి చెందిన మూడు కంపెనీల్లో డైరెక్టరుగా ఎలా ఉన్నాడనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. మనీలాండరింగ్ కేసులో అర్పితాముఖర్జీ, బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీలను అరెస్టు చేసిన ఈడీ తాజాగా అర్పితా కంపెనీల్లో కో డైరెక్టరు అయిన కల్యాణ్ ధర్ పై దృష్టి పెట్టింది. అర్పితా కంపెనీల్లో కో డైరెక్టరు అయిన కల్యాణ్ ధర్ పేపర్లపై కోటీశ్వరుడిగా పేర్కొనగా, కారు డ్రైవరు అయిన ఈయనకు కనీసం ద్విచక్రవాహనం కూడా లేదని దర్యాప్తులో తేలింది. 


అర్పితా ముఖర్జీ సింబయాసిస్ మర్చంట్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట కోల్‌కతా(Kolkata) కేంద్రంగా హోల్ సేల్ వెరైటీ వస్తువుల వ్యాపార సంస్థను నెలకొల్పి, అందులో కారు డ్రైవరు కల్యాణ్ ధర్ ను డైరెక్టరును చేశారు. అర్పితా సెంట్రీ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట మరో కంపెనీని నెలకొల్పి అందులోనూ కారు డ్రైవరును డైరెక్టరును చేశారు. అర్పితా ఎచ్చే ఎంటైర్‌టైన్‌మెంటు ప్రైవేటు లిమిటెడ్ పేరిట 2014లో ఏర్పాటు చేసిన కంపెనీలోనూ కారు డ్రైవరును డైరెక్టరుగా నియమించారు.అర్పితా కంపెనీల్లో కో డైరెక్టరుగా ఉన్న కల్యాణ్ ధర్ కోల్ కతా నగరంలో అతి చిన్న ఇంట్లో నివాసముంటున్నాడని ఈడీ దాడుల్లో వెలుగుచూసింది. 


కల్యాణ్ ధర్ భార్య అర్పితాముఖర్జీ చెల్లెలని దర్యాప్తులో వెల్లడవడం విశేషం. కల్యాణ్ ధర్ వేరేవారి కారుకు డ్రైవరుగా పనిచేస్తుండగా, అతని భార్య అయిన అర్పితా చెల్లెలు పాఠశాలలో గ్రూప్ డి ఉద్యోగం చేస్తున్నారని తేలింది. స్కాంలో వసూలు చేసిన అవినీతి సొమ్మును దాచుకునేందుకు బోగస్ చిరునామాలతో సూట్ కేస్ కంపెనీలు, డమ్మీ డైరెక్టరును అర్పితాముఖర్జీ నియమించారని వెల్లడైంది. ఈడీ విచారణలో వెలుగుచూస్తున్న అర్పితా ముఖర్జీ లీలలతో అధికారులే షాక్ అయ్యారు.

Updated Date - 2022-08-04T14:00:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising