ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి: కెప్టెన్

ABN, First Publish Date - 2022-01-06T01:22:40+05:30

పంజాబ్‌ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, శాంతి భద్రతలను కాపాడాలన్నా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిరోజ్‌పూర్: పంజాబ్‌ రాష్ట్రం సురక్షితంగా ఉండాలన్నా, శాంతి భద్రతలను కాపాడాలన్నా అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. రోడ్ల దిగ్బంధంతో ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్‌పైనే ఉండిపోవాల్సి రావడంపై పంజాబ్‌ సర్కార్‌ను ఆయన తప్పుపట్టారు. ఇది తీవ్రమైన భద్రతా లోపమేనని అన్నారు. పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా లోపించాయని ఆరోపించారు. ''ప్రధానికి సురక్షితంగా ప్రయాణించడానికి వీలు కల్పించలేకపోతే, అందులోనూ పాకిస్థాన్ సరిహద్దుకు 10 కిలోమీటర్ల దూరంలో ప్రధానికి రక్షణ కల్పించ లేకుంటే మీరు మీ పదవిలో కూర్చునేందుకు తగరు. వెంటనే పదవి నుంచి తప్పుకోండి'' అని ముఖ్యమంత్రి, హోం మంత్రిపై మీడియా సమావేశంలో కెప్టెన్ విరుచుకుపడ్డారు.

Updated Date - 2022-01-06T01:22:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising