ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్లమెంటులో కన్నడలో మాట్లాడిన కెనడా ఎంపీ.. వీడియో ఇదిగో!

ABN, First Publish Date - 2022-05-20T22:14:01+05:30

కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కెనడా ఎంపీ చంద్ర ఆర్య పార్లమెంటులో తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడి సంచలనం సృష్టించారు. ఇప్పుడీ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాతృభాషలో మాట్లాడి ఎంతోమంది హృదయాలను గెలుచుకున్న చంద్ర ఆర్యపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.  ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఆయన.. కెనడా పార్లమెంటులో తాను తన మాతృభాషలో మాట్లాడినట్టు పేర్కొన్నారు. అందమైన ఈ భాషకు ఎంతో చరిత్ర ఉందని, కెనడాలో 50 మిలియన్ల మంది దీనిని మాట్లాడుతున్నారని రాసుకొచ్చారు. ఇండియాకు వెలుపల ఓ దేశ పార్లమెంటులో కన్నడలో మాట్లాడడం ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. 


పార్లమెంటులో ఆయన తన మాతృభాష కన్నడలో మాట్లాడడంపై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలో నివసిస్తున్న ఐదుకోట్ల మంది కన్నడిగులకు ఇది గర్వకారణమన్నారు. కవి కువెంపు రాసి, డాక్టర్ రాజ్‌కుమార్ పాడిన పాటలోని ‘ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ కన్నడిగలానే ఉండు’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.  చంద్ర ఆర్య వీడియోను కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్‌నారాయ కూడా షేర్ చేశారు. చంద్ర ఆర్య 2015లో తొలిసారి, 2019లో మరోసారి కెనడా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. 



Updated Date - 2022-05-20T22:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising