ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక నుంచి ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక గుర్తు

ABN, First Publish Date - 2022-06-13T20:56:23+05:30

కెనడాలో సిగరెట్‌ ప్యాకెట్ సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై గ్రిఫిక్ ఫొటోలను ముద్రించి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇక నూతన ప్రతిపాదన గురించి కెనడా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కొనసాగుతున్న సందేశాలు కొత్తదనాన్ని కోల్పోయాయి. ప్రస్తుత రోజుల్లో ప్యాకెట్లపై హెచ్చరికలు అంతగా పని చేయకపోవచ్చు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టొరంటో: ఇప్పటి వరకు సిగరెట్ ప్యాకెట్లపై ఉన్న హెచ్చరిక చిత్రాలు ఇక నుంచి ప్రతి సిగరెట్‌పైకి ఎక్కనుంది. ప్యాకెట్లపై ఉండే ఈ సూచనలు ప్రస్తుత పరిస్థితుల్లో అంతగా ప్రభావం చూపడం లేదని, అందుకే నేరుగా సిగరెట్ల మీదనే హెచ్చరిక సూచనలు చేయాలని భావిస్తున్నారు. అయితే ఇది ఇండియాలో కాదులెండి. కెనడా దేశంలో ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కెనడా పూర్తి చేసింది. ఇది కనుక అమలులోకి వస్తే.. ఇలా ఒక్కో సిగరెట్‌పై హెచ్చరికలు ముద్రించిన తొట్ట తొలి దేశంగా కెనడా ఖ్యాతికెక్కుతుంది.


కెనడాలో సిగరెట్‌ ప్యాకెట్ సహా ఇతర పొగాకు ఉత్పత్తులపై గ్రిఫిక్ ఫొటోలను ముద్రించి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇక నూతన ప్రతిపాదన గురించి కెనడా ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం కొనసాగుతున్న సందేశాలు కొత్తదనాన్ని కోల్పోయాయి. ప్రస్తుత రోజుల్లో ప్యాకెట్లపై హెచ్చరికలు అంతగా పని చేయకపోవచ్చు. అందుకే నేరుగా ఉత్పత్తి చేసిన వస్తువులపైనే హెచ్చరికలు ముద్రించాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో భాగంగానే ప్రతి సిగరెట్‌పై హెచ్చరికలు ముద్రించాలని అనుకున్నాం. ప్రతి వస్తువుపై ఈ హెచ్చరికలు ఉంటే పొగాకు వినియోగాన్ని తగ్గించవచ్చు. ఇలా ఉండడం వల్ల మనం చెప్పాలనుకున్న సందేశం నేరుగా ప్రజలకు చేరుతుంది’’ అని అన్నారు.


అయితే ఈ తాజా నిర్ణయం ఇప్పుడప్పుడే అమములోకి రాదట. ఈ నిర్ణయంలో మార్పుల కోసం ఈ శనివారం నుంచి సంప్రదింపుల్ని ప్రారంభిస్తారట. అన్ని అనుకున్నట్లు జరిగితే మరో ఏడాదిలో అమలులోకి తీసుకురావాలని కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. కెనడాలో ధుమాపానం చేస్తున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందట. గత నెలలో విడుదల చేసిన డేటా ప్రకారం.. 10 శాతం కెనడియన్లు క్రమం తప్పకుండా ధుమాపానం చేస్తున్నారట. ఈ సంఖ్యను మరింత తగ్గించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నట్లు కెనడియన్ పాలసీ ఎనలిస్ట్ రాబ్ కన్నింగ్‌హామ్ తెలిపారు.

Updated Date - 2022-06-13T20:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising