ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 సెకన్లలో ఆదేశాలివ్వొచ్చు..

ABN, First Publish Date - 2022-12-07T04:34:05+05:30

అత్యాచారం కేసులోని నిందితుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను విచారించకుండా కింది కోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని మంగళవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కానీ, ముందు హైకోర్టుకు వెళ్లండి

రేప్‌ బాధితురాలికి సుప్రీం సూచన

న్యూఢిల్లీ, డిసెంబరు6: అత్యాచారం కేసులోని నిందితుడు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను విచారించకుండా కింది కోర్టును ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును లిస్టింగ్‌ చేయడంలో కింది కోర్టు తప్పేమీ చేయలేదని, అందువల్ల ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. గోవాలో జరిగిన ఓ అత్యాచారం కేసులో నిందితుడి బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం విచారణ జరపాలని పణజీలోని అదనపు జిల్లా-సెషన్స్‌ కోర్టు నిర్ణయించింది. ఈ విచారణను నిలిపివేసేలా ఆదేశించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం తొలుత దీనిపై బాంబే హైకోర్టు గోవా బెంచ్‌ను ఆశ్రయించాల్సి ఉందని తెలిపింది. నేరుగా సుప్రీంకోర్టుకు రావడం తగదని పేర్కొంది. ‘‘మేం ఆదేశాలు ఇవ్వడం పది సెకండ్లలో జరిగే పని. కానీ నిందిడుడు వారం రోజుల పాటు జైలులో ఉండి స్వేచ్ఛను కోల్పోతాడు’’ అని వ్యాఖ్యానించింది. ఒక వేళ కింది కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తే హైకోర్టుకు వెళ్లొచ్చని తెలిపింది.

Updated Date - 2022-12-07T04:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising