ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : విద్వేష నేరాల నియంత్రణ మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై దాడులకూ వర్తిస్తాయా? : కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్ట్

ABN, First Publish Date - 2022-08-06T21:18:06+05:30

విద్వేష దాడుల(Hate Crime) నియంత్రణకు సుప్రీంకోర్ట్(Supreme Court) ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై (Christian institutions) దాడులకు కూడా వర్తిస్తాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : విద్వేష నేరాల(Hate Crime) నియంత్రణకు సుప్రీంకోర్ట్(Supreme Court) ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు క్రైస్తవ సంస్థలపై (Christian institutions) దాడులకు కూడా వర్తిస్తాయా అని కేంద్ర ప్రభుత్వాన్ని(Central Govt) అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. గత కొన్నేళ్లుగా క్రిస్టియన్ సంస్థలపై దాడులు ఎక్కువయ్యాయంటూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ మేరకు ప్రశ్నించింది. ఈ పిల్‌‌ను బెంగళూరు ఆర్చ్‌బిషప్ పీటర్ మచడో దాఖలు చేశారు. నేషనల్ సాలిడారిటీ ఫోరం, ఎవాంజిలికల్ ఫెలోఫిప్ ఆఫ్ ఇండియాలతో కలిసి ఉమ్మడిగా దాఖలు చేశారు. క్రిస్టియన్ సంస్థలపై దాడుల నియంత్రణ, భద్రత చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. 


ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన బెంచ్ ఈ మేరకు కేంద్ర, రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది కాను అగర్వాల్ అడ్డుతగిలారు.  సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినకుండా నోటీసులు జారీ చేయవద్దని ఆయన కోరారు. కొద్ది సేపటి తర్వాత తుషార్ మెహతా వర్చువల్‌గా కోర్టుకు హాజరయ్యారు. దాఖలైన పిల్‌కు సంబంధించిన సమాచారాన్ని కేంద్రం సమర్పిస్తుందని చెప్పారు. 2018లో సుప్రీంకోర్ట్ ఆదేశాలతో రూపొందించిన సమగ్ర మార్గదర్శకాలు ప్రస్తుత కేసుకు వర్తిస్తాయా లేదా అని చెప్పాలని పేర్కొంది.

Updated Date - 2022-08-06T21:18:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising