ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Cabinet expansion: త్వరలోనే మంత్రివర్గ విస్తరణ

ABN, First Publish Date - 2022-09-24T17:16:13+05:30

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) తెలిపారు. శుక్రవారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కమీషన్‌ ఫిర్యాదులపై విచారణకు సిద్ధం

- ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై


బెంగళూరు, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) తెలిపారు. శుక్రవారం విదానసౌధలో ఆయన మీడియాతో మాట్లాడుతూ విస్తరణ అంశానికి అధిష్టానం సానుకూలంగా ఉందన్నారు. సాధ్యమైనంత త్వరగానే విస్తరణ చేపట్టాలని అధిష్టానం తెలిపిందన్నారు. ఢిల్లీ నుంచి పిలుపురాగానే సమగ్ర వివరాలు తెలుపుతామన్నారు. కమీషన్లపై ఫిర్యాదులు వస్తే విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. విచారణ ఏ విఽ దంగా చేయాలన్న దానిపై ఆలోచిస్తున్నామన్నారు. కాంట్రాక్టర్ల సంఘం కమీషన్ల ఆరోపణలు చేసిందని, అయితే ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదన్నారు. వారి వద్ద సమగ్రమైన వివరాలు ఉంటే లోకాయుక్తకు ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. కాంట్రాక్టర్లు ఆధారాలతో ఫిర్యాదు చేసిన వెంటనే విచారణకు ఆదేశిస్తామన్నారు. ప్రతిపక్షంలోనే ఐకమత్యం కొరవడినట్టు ఉందన్నారు. కాంట్రాక్టర్ల అంశాన్ని చివరగా ప్రస్తావించారని, అందుకు వారి వద్ద వాస్తవాలు లేకపోవడమే కారణమై ఉండవచ్చునన్నారు. కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ, న్యాయమూర్తి కెంపణ్ణ నివేదిక మరోవైపు ఉందన్నారు. రెండింటిపైనా చర్చలు జరగాలన్నారు. న్యాయమూర్తి కెంపణ్ణ ఏఏ అంశాలు ప్రస్తావించాలనేది చర్చల ద్వారా బహిరంగం కావాలన్నారు. తద్వారా ప్రజలకు అన్ని వివరాలు తెలుస్తాయన్నారు. ఇప్పటికే మంత్రి మునిరత్న ఆరోపణలు చేసినవారిపై పరువునష్టం దావా వేశారన్నారు. ఆధారాలు ఉంటే కోర్టు ముందు సమర్పించవచ్చునని సూ చించారు. ప్రతిపక్షనేత సిద్దరామయ్య అంశాన్ని ప్రస్తావిస్తూ 2006 సంవత్సరం నుంచి అన్ని అంశాలపైనా విచారణ సాగాలన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా సబ్‌ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల అక్రమాలతోపాటు అనేక అంశాలు వారికే తిరగబడినట్టయిందన్నారు. ప్రభుత్వం తరపున స్పం దించి తీసుకున్న చర్యలపైనే చర్చలు చేశారన్నారు. కొత్త అంశాలు వారు ఎందుకు తీ సుకురాలేదన్నారు. గత ప్ర భుత్వ హయాంలో సాగిన అక్రమాలపైనా తామే విచారణ జరిపామన్నారు. కానిస్టేబుల్‌ నియామకాల అవినీతిలో ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఇవ్వలేదనేది అందరికీ తెలిసిందేనన్నారు. ప్రస్తుతం ఎస్‌ఐ పోస్టుల అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. తప్పు చేసినవారు అరెస్టు అయ్యారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఉపాధ్యాయుల నియామకంలోనూ అక్రమం జరిగిందని గుర్తు చేశారు. కాంట్రాక్టర్ల విషయాన్ని పదే పదే ప్రస్తావించడం ద్వారా ప్రజలు నమ్ముతారని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారన్నారు. 

Updated Date - 2022-09-24T17:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising