ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mexico: భారీ భూకంపం...సునామీ హెచ్చరిక జారీ

ABN, First Publish Date - 2022-09-20T13:24:52+05:30

మెక్సికో(Mexico) దేశంలో సోమవారం రాత్రి భారీ భూకంపం(earth quake) సంభవించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెక్సికో సిటీ: మెక్సికో(Mexico) దేశంలో సోమవారం రాత్రి భారీ భూకంపం(earth quake) సంభవించింది. మెక్సికో సిటీకి సమీపంలోని పాంతాల్లో సోమవారం అర్ధరాత్రి భారీభూకంపం సంభవించడంతో పలు భవనాలు కుప్పకూలిపోయాయి. చెట్లు, భవనాలు కూలిపోవడంతోపాటు ఒకరు మరణించారు. ఈ భూకంపం వల్ల సునామీ(Tsunami) హెచ్చరిక జారీ చేశారు. భూకంపం వల్ల కార్లు, భవనాలు, చెట్లు ఊగిపోయాయి. దీంతో జంతువులు పరుగులు తీశాయి.భూకంపంతో జనం తీవ్ర భయాందోళనలు చెందారు. మెక్సికోలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. మిచోకాన్ సరిహద్దుల్లోని పశ్చిమతీరంలోని కోలిమా వద్ద 15కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 



ఈ భూకంపం వల్ల మంజానిల్లోని ఫసిఫిక్ పోర్టులో ఓ డిపార్టుమెంటు భవనం కూలిపోవడంతో ఒకరు మరణించారు.ఓ ఆసుపత్రిలో భవనం గ్లాసులు పగిలి ఒకరు గాయపడ్డారు. మెక్సికో భూకంపం అనంతరం యూఎస్ ఫసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం(US Pacific Tsunami Warning Center) సునామీ హెచ్చరికలు(Tsunami warning) జారీ చేసింది.



Updated Date - 2022-09-20T13:24:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising